సిక్కు మహిళల మతమార్పిడి..కిషన్ రెడ్డి సీరియస్.. !
ఈ సంధర్భంగా ఆయనకు ఫిర్యాదు చేస్తూ ఓ లేఖను సమర్పించింది. దీనిపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ....జమ్మూకాశ్మీర్ లో బలవంతపు మతమార్పిళ్లపై ఫిర్యాదు వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సిక్కు మహిళలను తుపాకులతో బెదిరించి మతం మార్చుతున్నారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కశ్మీరీ పండిత్ ల విషయంలో కూడా ఇలాగే జరిగిందంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం, జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. వారికి రక్షణ కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక రూపల్లో దౌర్జన్యాలు జరగతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు.
ఎన్నికల అనంతరం జరిగిన హింస లో 25 మంది చనిపోయారని..15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటు వేసిన వారిని గుర్తించి ఇళ్లను తగలబెట్టడం, త్రాగు నీరును కట్ చేయడం వంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఎక్కడైనా శాంతిభద్రత సమస్యలు ఉంటే గవర్నర్ చూసుకుంటారని కానీ..గవర్నర్ పై కూడా బెంగాల్ సీఎం మమతా అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. రాష్టంలో ఒక మహిళ ముఖ్యమంత్రి ఉండి కూడా... 7 వేల మంది మహిళలపై దాడులు జరిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.