టీటీడీ చైర్మ‌న్ మ‌ళ్లీ రెడ్డికేనా... జ‌గ‌న్ ఈక్వేష‌న్ రాంగా ?

VUYYURU SUBHASH
ఏపీలో గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు నుంచి సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోష‌ల్ ఇంజ‌నీరింగ్ విష‌యంలో ప‌క్కా లెక్క‌ల‌తో ముందు ఉంటున్నారు. అయితే అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ క్ర‌మ‌క్ర‌మంగా రెడ్డి వ‌ర్గానికే పెద్ద పీఠ‌వేసుకుంటున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. విమ‌ర్శ‌లు రావ‌డం మాత్ర‌మే కాదు.. ఎమ్మెల్యేల నుంచి నామినేటెడ్ ప‌ద‌వుల వ‌ర‌కు చాలా మంది రెడ్డి వ‌ర్గం వారే ఉంటున్నారు. అయితే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఈ మ‌చ్చ తుడిపేసుకోవ‌డం కోసం కొన్ని జ‌న‌ర‌ల్ ప‌ద‌వుల‌ను కూడా బీసీ, ఇత‌ర సామాజిక వ‌ర్గాల వారీగా క‌ట్ట‌బెట్టారు. ఇదిలా ఉంటే ప్ర‌తిష్టాత్మ‌కమైన టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ని ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ రెడ్డి వ‌ర్గానికే చెందిన త‌న బాబాయ్‌, మాజీ ఎంపీ వైవి. సుబ్బారెడ్డికి ఇచ్చారు.
జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే సుబ్బారెడ్డికి ఈ ప‌ద‌వి ఇచ్చారు. ఆయన రెండేళ్ల ప‌ద‌వీ కాలం పూర్త‌య్యింది. అయితే ఆయ‌న్ను మ‌రోసారి ఈ ప‌ద‌విలో కంటిన్యూ చేసేందుకు జ‌గ‌న్ సుముఖంగా ఉన్న‌ట్టు లేరు. అందుకే బోర్డు కూడా ర‌ద్దు అయ్యింది. ఇక కొత్త టీటీడీ చైర్మ‌న్ ఎవ‌రు అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్సే.. ఎవ‌రి అంచనాలు ఎలా ?  ఉన్నా జ‌గ‌న్ మ‌దిలో ఎవ‌రు ?  ఉంటార‌న్న‌ది మాత్రం తేల‌డం లేదు. ఇక ఇప్పుడు కొత్త చైర్మ‌న్ రేసులో సీనియ‌ర్ నేత , మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి పేరు బ‌లంగా వినిపిస్తోంది.
గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎంపీ సీటు ఇవ్వ‌లేదు. అయితే ప్ర‌స్తుత మంత్రి బాలినేని ఒత్తిడి మేర‌కే జ‌గ‌న్ సుబ్బారెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీ సీటు ఇవ్వ‌లేదు. ఇక ఇప్పుడు రెండేళ్ల పాటు టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు మాత్రం సుబ్బారెడ్డి ఎమ్మెల్సీ అయ్యి.. కేబినెట్లో మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకోవాల‌ని చూస్తున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి మ‌ళ్లీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డికే ఇస్తే... వ‌రుస‌గా ఈ కీల‌క ప‌ద‌విని రెడ్ల‌కే ఇస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు అయితే వ‌స్తాయి. మ‌రి జ‌గ‌న్ ఆలోచ‌న ఎలా ఉందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: