చైనా దాచిన నిజం బయటపడింది.. మొదటి కరోనా కేసు ఎప్పుడో తెలుసా?

praveen
చైనా చేసిన పాపానికి ప్రస్తుతం ప్రపంచం మొత్తం అల్లాడి పోతుంది. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను  గుప్పిట్లోకి తెచ్చుకుంది. దీంతో ఇక ఒకరకం వైరస్ ను కంట్రోల్ చేసాము అనుకుంటున్న తరుణంలోనే మరొక రూపంలోకి రూపాంతరం చెంది శర వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు మొత్తం వైరస్ బారి నుంచి కోలుకోలేక పోతున్నాయి. దీంతో రోజు రోజుకు విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే వైరస్ వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నప్పటికీ చైనా మాత్రం వైరస్ కు సంబంధించిన అసలు నిజాలు దాస్తూనే వస్తుంది.

 అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి వెళ్ళిన ఊహన్ ల్యాబ్ లో పరిశోధనలు చెయ్యనివ్వలేదు. కానీ ఇటీవలే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు ఒక బృందంగా ఏర్పడి  కరోనా వైరస్ నిజాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.  ఇటీవలే మరో నిజం బయటపడింది. చైనాలో మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది నవంబర్ 17వ తేదీన అనే విషయం బయటపడింది. ఆ తర్వాత జపాన్లో తర్వాత థాయిలాండ్, స్పెయిన్ దేశాలకు పాకింది అనే విషయాన్ని ఇటీవలే నిపుణుల బృందం గుర్తించింది.

 తర్వాత కొరియా, అమెరికా ఇలా అన్ని దేశాలు కూడా వైరస్ బారిన పడ్డాయి అనే విషయాన్ని గుర్తించారు. నవంబర్ 17న మొట్టమొదటి కేసు వెలుగులోకి వచ్చినప్పటికీ చైనా ఈ విషయాన్ని దాచి ప్రపంచ దేశాలలో విపత్కర పరిస్థితులు తీసుకురావాలని భావించింది అంటూ  అభిప్రాయం వ్యక్తం చేశారు నిపుణులు  . ఇలా ప్రపంచ దేశాల వినాశనానికి చైనా చేసిన కుట్ర కరోనా వైరస్ అని అంటున్నారు . కరోనా కు సంబంధించి ఒక్కొక్క నిజం బయటపడుతూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రపంచ దేశాల ముందు చైనా ను దోషిగా నిలబెడుతున్నాయి బయటపడుతున్న నిజాలు . ఇక మరి కొన్ని రోజుల్లో ఎలాంటి నిజాలు బయట పడతాయి అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: