దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉంది : భట్టి

praveen
గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నెలకొంది.  ఈ నేపథ్యం లోనే అటు కేసీఆర్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నాయి.  ఏపీ ప్రభుత్వం అక్రమం గా తెలంగాణకు రావాల్సిన జలాలను పట్టుకెళ్తుందని.. దీనిపై కేసీఆర్ మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరించడం దారుణం అంటూ ప్రతి పక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జల హక్కుల విషయం లో ఇప్పటి కే తెలుగు రాష్ట్రాల మధ్య పలు మార్లు చర్చలు జరిగాయి.

 కానీ ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన జల వివాదం కాస్త ఒక కొలిక్కి రాలేదు. అయితే మొదటి నుంచి  స్నేహ పూర్వకం గానే కొనసాగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జల వివాదం విషయం లో పలుమార్లు విమర్శలు ప్రతి విమర్శలు కూడా జరిగాయి. అయితే తెలంగాణ ప్రజల ప్రయోజనాలని కెసిఆర్ జగన్ దగ్గర తాకట్టు పెట్టారు అంటూ అటు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క  తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు కట్టి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకెళ్తుందని గతం లోనే తాము ప్రభుత్వాన్ని హెచ్చరించాము అంటూ బట్టి విక్రమార్క తెలిపారు. ఇక ఇదంతా జరుగుతున్నప్పటికీ అటు టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు మాత్రం.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు ఉంది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు భట్టి విక్రమార్క. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లను ఏపీ ప్రభుత్వం పిలవక ముందే తాము తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించామని తెలిపారు. కానీ ఇప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం మొద్దు నిద్ర వీడలేదు అంటూ విమర్శించారు. తుపాకీ రాముడు లాగా ఊర్లో తిరుగుతున్న కెసిఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు భట్టి విక్రమార్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: