కర్ఫ్యూ రూల్స్ ఎమ్మెల్యేకు వర్తించవా..? అడ్డగిస్తే బదిలీ తప్పదా..?

MOHAN BABU
కర్ఫ్యూ రూల్స్ ఎమ్మెల్యేకు వర్తించవా..? అడ్డగిస్తే బదిలీ తప్పదా..?
రాజకీయ నాయకులకు,  ప్రజలకు మధ్య వారధిగా ఉండేదే పోలీస్ వ్యవస్థ.  కరోణ కష్టకాలంలో తిండి తిప్పలు లేకుండా రాత్రనకా, పగలనకా ప్రజల కోసం,  నాయకుల శ్రేయస్సు కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తులలో పోలీసులది ముఖ్య పాత్ర అని చెప్పవచ్చు.  పోలీసన్న లేకుంటే అడుగు కూడా బయటపెట్టని రాజకీయ మహోన్నతులు ఆ నాలుగో  సింహాలను కనీసం గౌరవించడం లేదు. ప్రతి పోలీసన్న నాయకుల చేతిలో అడుగడుగున నలిగిపోతు అవమానాలకు గురవుతున్నాడు.  ఇటు ప్రజలకు అటు రాజకీయ నాయకులకు మధ్య వారధిగా ఉంటూ చట్టానికి లోబడి రాజ్యాంగ విలువలను కాపాడుతున్నారనడంలో పోలీసన్న ఏ మాత్రం తీసిపోడు.  
 కానీ కొంత మంది ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు అహంకారంతో,  నిబంధనలు తుంగలో తొక్కి వ్యవహరిస్తున్నారు.  అలాంటి ఘటనలు దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి.  వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రూర్కీ ఎమ్మెల్యే ప్రదీప్ వాత్ర తమ కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లారు.  అప్పటికే కర్ఫ్యూ సడలింపు సమయం అయిపోయి దాదాపు ఎనిమిది గంటలు దాటింది.  సబ్ ఇన్స్పెక్టర్  నీరజ్ గతయేత్  వారి కారును అడ్డగించారు.  కరోనా నిబంధనలు పాటించడంలేదని,  మాస్కూల్ సరిగా పెట్టుకోలేదని వారితో అన్నారు. దీంతో సదరు ఎమ్మెల్యే సబ్ ఇన్స్పెక్టర్ పై కోపానికి వచ్చారు. దీంతో ఇన్స్పెక్టర్ 500 రూపాయలు ఫైన్ కట్టాలని చలానా వేసారు.  కోపం వచ్చిన ఎమ్మెల్యే 500 రూపాయల నోటు తీసి పోలీసుల వైపు విసిరేసి వెళ్లిపోయారు.

మరుసటి రోజు సబ్ ఇన్స్పెక్టర్ నీరజ్ వేరే చోటికి బదిలీ చేశారు.  అప్పటికే ఈ విషయం బయటకి పొక్కడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ప్రజలకేనా,  నాయకులకు వర్తించవా అని సదరు పోలీస్ అన్నకు అండగా నిలిచారు. ఇప్పటికైనా  రాజకీయ నాయకుడు గమనించాలి. మనకు అండగా నిలిచే పోలీసన్నలకు గౌరవం ఇవ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: