వీడియో : బూతుపురాణంతో పాకిస్థాన్ పార్లమెంట్?

praveen
ఒక దేశ పార్లమెంట్ అంటే విధి విధానాలకు లోబడి ఉంటుంది.  పార్లమెంటు లోని సభ్యులు అందరూ ఎప్పుడు హుందాగా వ్యవహరిస్తూ ఉంటారు.  అధికార పార్టీ చేపట్టిన ఏదైనా బిల్లు నచ్చకపోతే నిరసన కూడా హుందాగా తెలుపుతూ ఉంటారు.  భారత పార్లమెంటు లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఇదే తరహా సీన్ కనిపిస్తూ ఉంటుంది.  కానీ ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన పార్లమెంటులో.. ఏకంగా ఒకరిని ఒకరు కొట్టుకోవడం.. సామాన్య ప్రజల కంటే దారుణంగా బూతులు తిట్టుకోవడం లాంటివి అస్సలు జరగదు.  ఇలాంటివి అటు రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా.

 కానీ ఇక్కడ వీడియో చూస్తే మాత్రం పాకిస్తాన్ పార్లమెంట్ లో ఇలాంటి చట్టాలు గాని రూల్స్ గాని ఏమీ లేవు అన్నది అర్ధమవుతుంది.  ఉంటే ఏంటి వాళ్ళకి మాత్రం వర్తించవు అన్నది ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది.  ఇటీవలే పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ కాస్త  రణరంగాన్ని తలపించింది. అధికార పక్షాన్ని ప్రశ్నించినందుకు ఏకంగా అధికార పార్టీ ఎంపీలు ప్రతిపక్ష పార్టీ ఎంపీలపై దాడి చేశారు. మేము ఏమైనా తక్కువ తిన్నామా అనుకున్నారో ఏమో.. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా ఎక్కడా తగ్గలేదు. హుందాగా వ్యవహరించాల్సిన ఎంపీలు పార్లమెంటులో చిల్లర వేషాలు వేశారు.  ఒకరిపై ఒకరు పుస్తకాలు పేపర్లు విసురుకోవడం సంచలనంగా మారిపోయింది.

 ఇక తిట్లపురాణం అంటారా..  ఆ బూతు పురాణం గురించి ఇక్కడ రాస్తే అది చదవడానికి కూడా మీరు ఇబ్బంది పడతారేమో..  అంత ఘోరమైన బూతులతో ఒకరినొకరు దూషించు కున్నారు   .. ఇక అంతే కాదు అదే పార్లమెంటులో ఉన్న మరికొంతమంది ఇక అక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. ఇక సోషల్ మీడియా వేదిక లోకి ఎక్కిన తర్వాత ఈ వీడియోలు వైరల్ గా మారిపోయాయి.  పార్లమెంటులో ఎంపీలు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలు సైతం షాక్ అయ్యారు. తమ తరుపున ప్రాతినిధ్యం వహించమని పార్లమెంటుకు పంపితే అక్కడ ఇలా తిట్టుకోవడం, కొట్టుకోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు అక్కడి ప్రజలు. ఏదేమైనా ఇంత దారుణ పరిస్థితి మాత్రం ఏ పార్లమెంట్ లో చూసి ఉండరు ఇప్పటివరకు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: