మార్కెట్లోకి ఆనందయ్య నకిలీ మందు.. తస్మాత్ జాగ్రత్త?

praveen
మధ్యకాలంలో లోకం మొత్తం నకిలీ మయం అవుతుంది. మార్కెట్లోకి ఏ వస్తువు వచ్చినా రోజుల వ్యవధిలోనే దానికి నకిలీ కూడా తయారైపోతుంది. దీంతో నకిలీ ఏది అసలైనది ఏది అని అర్థం కాక జనాలు జుట్టు పీక్కుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే కేవలం వస్తువుల విషయంలోనే కాదు మందుల విషయంలో కూడా ఇది రోజురోజుకు పెరిగిపోతోంది.  ఇప్పటికీ ఎన్నో రకాల నకిలీ మందులు మార్కెట్లో చెలామణి అవుతున్నాయ్. ఇక ఇప్పుడు ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన మందుకి కూడా నకిలీ వచ్చేసింది.  కరోనా వైరస్ చికిత్సలో కృష్ణపట్నం కు చెందిన ఆనందయ్య మందు ఎంతో సమర్థవంతంగ పని చేస్తుండగా.. ఈ మందు ఇటీవలే పంపిణీ ప్రారంభమైంది.

 ఆనందయ్య మందు ప్రస్తుతం పంపిణీ ప్రారంభం అయిందో లేదో అప్పుడే ఈ మందుకు నకిలీ వచ్చేసింది. ఇప్పటికే ఆనందయ్య మందు పంపిణీ కి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటే..  అటు ఆనందయ్య నకిలీ మందు తయారు చేసి కేటుగాళ్లు సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆనందయ్య మందు తయారీకి ఉపయోగించే వస్తువులు మూలికలకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేశారు.  ఈ క్రమంలోనే ఇక ఆ వస్తువులతో మందులు తయారుచేసి ఇది ఆనందయ్య మందు అంటూ ఎంతో మంది జనాల్ని బురిడీ కొట్టిస్తున్నారు

  అయితే ఆనందయ్య మందుకు అనుమతి వచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ అసలైన కరోనా రోగులకు మాత్రం మందు అందడం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి దీంతో ఇక ఆనందం పేరుతో ఎంతోమంది కేటుగాళ్లు మార్కెట్లోకి ప్రవేశించి నకిలీ మందులను తయారు చేస్తూ ప్రజలను బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఇక ఆనందయ్య సూచించిన వస్తువులతోనే మందు తయారు చేసి వాటిని డబ్బాలో ప్యాక్ చేసి దాదాపు రెండు వేల రూపాయలకు అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది ఇలా నకిలీ మందుల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: