ఆనందయ్యా మాయమాయ్యడు.. వెతుకుతున్న జనాలు?

praveen
ఆనందయ్య..  ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది. కరోనా వైరస్ పై అటు వ్యాక్సిన్లు సైతం సమర్థవంతంగా ప్రభావం చూపలేక పోతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య తయారుచేసిన  మందు వైరస్ పై ఎంతో సమర్థవంతంగా పని చేయడం సంచలనం గా మారిపోయింది. ఇక ఆ తర్వాత కేంద్ర ఆయుష్ మిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆనందయ్య మందుపై పరిశోధనలు జరిపి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అంటూ స్పష్టం చేసింది.  అంతేకాదు ప్రజలందరికీ ఆనందయ్య మందులు అందుబాటులో ఉంచాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.

 దీంతో ప్రజలు అందరూ ఎంతో సంతోష పడిపోయారు. మరికొన్ని రోజుల్లో ఆనందయ్య  మందు అందుబాటులోకి వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆనందయ్య మందుకు అనుమతిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది లేదో అప్పటినుంచి ఆనందయ్య కనిపించకుండా పోయారు. అసలు ఆనంద ఎక్కడికి వెళ్లారు.. ఎవరు దాచిపెట్టారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. గత కొన్ని రోజుల నుంచి ఆనందయ్య ఎక్కడ తెరమీద కనిపించడం లేదు. అయితే దీనికంతటికీ కారణం స్థానిక ప్రజాప్రతినిధులు అని అంటున్నారు విశ్లేషకులు.  ఎంతో మంది స్థానిక ప్రజాప్రతినిధులు తమ అధికారంతో ఒక సామాన్యుడు అయినా ఆనందయ్య తో తమకు భారీగా మందు తయారు చేసి ఇవ్వాలి అంటూ ఒత్తిడి తీసుకురావడం... వాళ్ల కోసం భారీ మొత్తంలో మందు తయారు చేస్తుండటం వల్ల ఆనందయ్య ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు అని అర్థమవుతుంది.

 దీంతో ఆనందయ్య ఎటు వెళ్లారు అన్న చర్చ మొదలయింది.. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆనందయ్య వేర్ ఆర్ యు అనే హ్యాష్ ట్యాగ్ సైతం వైరల్ గా మారి పోయింది అంటే ప్రస్తుతం ఆనందయ్య మందు గురించి ఎంత చర్చ జరుగుతుంది అన్నది అర్ధమవుతుంది. అయితే దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి ఆనందయ్య తో మళ్ళీ మందు తయారు చేయించి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకు వస్తే బాగుంటుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: