పాకిస్తాన్లో నన్ను ముస్లింగా మారమన్నారు.. అసలు విషయం చెప్పిన ప్రశాంత్?

praveen
ప్రేమ కోసం స్విట్జర్లాండ్ బయలుదేరి చివరికి పాకిస్తాన్ లో చిక్కుకున్న హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ ఇక అక్కడే 2017 నుంచి జైలులో మగ్గి పోయాడు. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చొరవతో మళ్లీ ఇండియా కు చేరుకున్నాడు. ఇటీవలే ప్రశాంత్ పాకిస్థాన్ అధికారులు వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించారు. ఇక ఇటీవలే ప్రశాంత్ హైదరాబాద్ చేరుకున్నాడు.ఇక సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో ప్రశాంత్ ను తన తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు ఇక ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ పాకిస్థాన్లో జరిగిన విషయాల గురించి తెలిపాడు.

 అతను అమ్మ మాట వినకుండా వెళ్లి చివరికి పాకిస్తాన్లో చిక్కుకున్నాను.. కానీ ఇంత తొందరగా మళ్ళీ ఇంటికి చేరుకుంటాను  అని మాత్రం ఊహించలేదు చెప్పుకొచ్చాడు. కేవలం తాను మాత్రమే కాదు పాకిస్తాన్ లో ఎంతో మంది భారతీయులు సైతం జైలు శిక్షను అనుభవిస్తున్నారని వారి వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నట్టు తెలిపారు.  ఇక తనలాగే వారిని కూడా కేంద్ర ప్రభుత్వం ఇండియాకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటుందని  ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

 పాకిస్తాన్ బార్డర్లో తనను పట్టుకోలేదని.. బార్డర్ దాటి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ లో పెట్రోలింగ్ చేస్తున్న అధికారులు పట్టుకున్నారని.. తన పట్ల ఎక్కడ దురుసుగా వ్యవహరించలేదు అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే పాకిస్థాన్లో ఉన్న భారత ఖైదీలనందరిని కూడా ముస్లిం మతంలోకి మారాలని అక్కడి అధికారులు అడుగుతారని.. తనను కూడా అలా అడుగగా తాను మాత్రం మారను అంటూ చెప్పాను అంటూ తెలిపాడు ప్రశాంత్. 2017 నుంచి బావల్ పూర్ సెంట్రల్ జైల్ లో ఉన్నానని ఇక ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి చేరుకోవడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు   మళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ లో చేరి తల్లిదండ్రులకు తోడుగా ఉంటాను అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ తండ్రి..  తన కొడుకును ఇండియా రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహాయం చేసిందని.. తనకు తన అపార్ట్మెంట్ వాసులు కూడా తనకు ధైర్యం చెప్పారు అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తన కొడుకు మళ్లీ తమ వద్దకు వస్తాడో రాడో అని ఎన్నో నిద్ర లేని రాత్రులను గడిపామని.. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ప్రశాంత్ తండ్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: