16 గంటలు స్నానం చేసిన మహిళ.. చివరికి ఇలా మారిపోయింది?

praveen
సాధారణంగా ఎవరైనా సరే స్నానం చేయడానికి ఐదు లేదా పది నిమిషాల సమయం తీసుకుంటారు.  ఇక ఇక కొంతమంది అతి శుభ్రత పాటించాలి అనుకునేవారు మహా అయితే పదిహేను నిమిషాలు టైమ్ తీసుకుంటారు..  ఎంత ఎక్కువ అన్న అరగంట కంటే ఎక్కువ సేపు ఎవరు స్నానం చేయరు.. ముఖ్యంగా బాత్రూం లో ఉండడానికి ఇష్ట పడరు. అలాంటిది గంటల పాటు బాత్రూం లోనే ఉంటూ ఎవరైనా స్నానం చేశారు అంటే వారికి ఏదో పైత్యం పట్టుకున్నట్టు ఉంది అని అనుకుంటారు ఎవరైనా. ఇక్కడ ఓ మహిళకు పైత్యం పట్టుకుందో లేదో తెలియదు కానీ..  ఏకంగా కొన్ని గంటలపాటు బాత్రూంలో స్నానం చేస్తూ ఉండిపోయింది.

 అది కూడా ఒకటి, రెండు గంటలు అనుకుంటే పొరపాటే.. ఏకంగా పదహారు గంటలపాటు స్నానం చేస్తూ ఉండి పోయింది ఇక్కడ ఒక మహిళ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. టిక్ టాక్ యూసర్ అయిన ఒక మహిళ 16 గంటలపాటు స్నానం చేసిందట. ఇక ఫలితంగా ఆమె కాళ్లు,చేతుల మీద చర్మం ముడుచుకు పోయింది. శరీరం మీద చర్మం కూడా నిర్జీవంగా మారి పోయింది. మొత్తం రక్తం పీల్చి నట్లుగా  పాలిపోయింది.  స్నానం చేయడం బాగానే చేసింది కానీ ఆ తర్వాత ఎదురైన చేదు అనుభవంతో సదరు మహిళ భయపడిపోయింది. దీంతో తన కాళ్ళు, చేతులను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

 తాను 16 గంటలపాటు స్నానం చేశానని.. దీంతో తన కాళ్ళు చేతులు ఇలా పూర్తిగా ముడుచుకుపోయాయని.. ఇది తగ్గాలి అంటే ఏం చేయాలి అంటూ నెటిజన్లను ఒక చిట్కా అడిగింది. హెల్ప్ చేయాలి అంటూ కోరింది. ఇక ఈ మహిళ పోస్ట్ చేసిన ఫోటోలు కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి..  ఇక ఫోటోలు కొంతమంది నెటిజన్లు నవ్వుకుంటూ ఉంటే మరి కొంతమంది విభిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. బాత్రూం లో 16 గంటలపాటు స్నానం చేయడం ఏంటి పొరపాటున మర్చిపోయి బాత్రూంలో నిద్రపోయావా అంటూ కామెంట్ లు పెడుతూ ఉంటే.. మరి కొంతమంది టిప్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: