20 మందితో పెళ్లి చేసుకోమంటే.. 200 మందిని పిలిచాడు.. చివరికి?

praveen
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది  రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక మొదటి నుంచి కరోనా కట్టడికి  రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.  ఇక ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడమే కాదు పెళ్ళిళ్ళు శుభకార్యాలకు ఎన్నో నిషేధాజ్ఞలు కూడా విధించింది. కేవలం కొంతమంది బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లిళ్లు జరుపుకోవాలి అంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేవలం 20 మంది సమక్షంలో పెళ్లిళ్లు జరుపుకునేందుకు అటు రెవెన్యూ అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంటూ తెలిపింది.

 అయితే ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి కోసం ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ అటు ప్రజలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం కరోనా పెరిగిపోవడానికి కారణంగా మారిపోతుంది. ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లలో ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం కేవలం 20 మందితో కాకుండా ఎక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. ఇక ఇటీవలే ఏకంగా వరుడు ఇలా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏకంగా 2 లక్షల జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 కేవలం 20 మంది సమక్షంలో మాత్రమే పెళ్ళి చేసుకునేందుకు  ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ.. వరుడు మాత్రం రూల్స్ బ్రేక్ చేశాడు. ఏకంగా 200 మంది ని పిలిచి మరి పెళ్లి చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే రూల్స్ బ్రేక్ చేసిన వారికి రెండు లక్షల జరిమానా విధించారు. ఈ ఘటన ఏపీ లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు పోలీసులు రెండు లక్షల జరిమానా విధించడంతో  వరుడు కాస్త తెల్లమొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: