బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..
అయితే చనిపోయే వారిలో ఎక్కువగా మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఉంటున్నారు. మ్యుకర్‌మైకోసిస్ ముక్కు, అంగిలి, కళ్లు, మెదడు వంటి శరీర భాగాలపై ఎక్కువగా దాడి చేస్తుందని ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ శ్వేత వెల్లడించారు. అంతేకాకుండా ఇతర శరీర భాగాలపై కూడా బ్లాక్ ఫంగస్ దాడి చేసే అవకాశం ఉందని ఆమె అన్నారు. మధుమేహం, క్యాన్సర్, మూత్రపిండ వ్యాధులతో బాధపడుతున్న వారు బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకోవాలని ఆమె అన్నారు. అయితే బ్లాక్ ఫంగస్ వచ్చిందని తెలుసుకోవడానికి గుర్తించాల్సిన లక్షణాలు ఏమిటో ఆమె తెలిపారు. అవేంటో కింద తెలుసుకుందాం.
1. సైనసిటిస్ - ముక్కు దిబ్బడ, ముక్కు కారటం.. శ్లేష్మం గోధుమ, నలుపు రంగులో రావటం.
2. దవడ ఎముకపై నొప్పి, ఒక వైపు ముఖ నొప్పి, తిమ్మిరి లేదా వాపు
3. ముక్కు / అంగిలి యొక్క శరీర భాగాలు నల్లని రంగులోకి మారడం
4. దంతాల వదులు, దవడల ఊడిపోయినట్టు అనిపించడం
5. కళ్ళు మసకబారటం లేదా వస్తువులు డబుల్ గా కనిపించడం.
6. థ్రోంబోసిస్, శరీరం యొక్క పైచర్మం చనిపోవటం.
7. ఛాతీ నొప్పి, ప్లూరల్ ఎఫ్యూషన్, శ్వాసకోశ లక్షణాలు తీవ్రమవ్వటం.
8. తీవ్రమైన తలనొప్పి రావటం
ఐతే కోవిడ్ 19 యొక్క కొన్ని కేసులకు చికిత్స చేయడానికి స్టెరాయిడ్లు వినియోగిస్తారు కాబట్టి చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శారీరక శ్రమ లేకపోవటం వంటి మరి కొన్ని సమస్యల కారణంగా డయాబెటిక్ రోగులకు బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని డాక్టర్ హెచ్చరించారు.