వైరల్ : సెక్స్ చేసేటప్పుడు శబ్దాలు వస్తున్నాయి అని ఫిర్యాదు ఎక్కడంటే.?

Suma Kallamadi
శృంగారం అనేది నవరసాలలో ఒక రసం అని చెప్పవచ్చు.అయితే శృంగారంలో పాల్గొంటే సహజంగానే కొందరు శబ్దాలు, అరుపులు చేస్తుంటారు. అయితే శృంగారంలో పాల్గొనే జంట చేసే శబ్దాలు బయటకు వినబడకుండా ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. అవే శబ్దాలు పక్కవారికి వినపడితేనే సమస్యలు తలెత్తుతాయి.అయితే ఇలాంటి ఒక విచిత్రమైన సమస్య అక్కడ కూడా జరిగిందట. శృంగారంలో పాల్గొనేటప్పుడు ఒక జంట చేసే శబ్దాల వలన పక్కన ఉంటున్న వ్యక్తి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాడని ఒక వ్యక్తి లెటర్ రాసి మరి పంపాడట. దీంతో ఆ లెటర్ కాస్త వైరల్‌గా మారింది.వివరాల్లోకి వెళితే..


స్టీఫెన్ కన్నింగమ్ అనే వ్యక్తి పొద్దునే నిద్రలేవగానే  తలుపు కింద ఒక లెటర్ కనిపించింది. ఏంటా లెటర్.ఎవరు దీన్ని ఇలా పడేసారు అని అతృతతో దాన్ని తీసి చదివి షాక్ అయ్యాడు.ఆ లెటర్ చదివిన తరువాత దానిని తన ఇంటికి సమీపంలో ఉన్న ఎవరో వ్యక్తి   రాసినట్లు గుర్తించాడు. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందో తెలిస్తే మీరే అవాక్ అవుతారు. స్టీఫెన్ అతని భార్య రాత్రి పూట శృంగారంలో పాల్గొన్నప్పుడు వాళ్ళు చేసే శబ్దాలు బయటకు వినిపిస్తున్నాయి అని, అలాగే వాళ్ళ ఇంటి గోడలు చాలా పలుచగా ఉండడం వలన  శబ్దాలు బయటకు వస్తాయని అవి వినడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. అందుకే  ఇకపై మీరు శృంగారంలో పాల్గొంటే సైలెంట్ గా పని చేసుకోండి. శబ్దాలు, అరుపులు చేయకండి అని లెటర్ లో రాసి ఉంది. 



అయితే ఆ లెటర్ ఎవరు రాసారో పేరు అందులో లేదు. తన ఇంటి పక్కన ఉండే ఎవరో రాసి ఉంటారని అతను అర్థం చేసుకున్నాడు. దీంతో ఒకింత ఎబ్బెట్టుగా ఫీల్ అయినట్లు ఉన్నాడు. అయితే అదే లెటర్‌ను అతను సోషల్ మీడియాలో షేర్ చేసాడు.ఇంకేముంది అది కాస్త  వైరల్‌గా మారింది. దానికి 800కు పైగా లైక్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ లెటర్‌ను చదివిన నెటిజన్లు వాళ్ళకు నచ్చిన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.కొందరేమో మీ చుట్టు పక్కల ఉన్నవారికి ఇయర్ ఫోన్స్ కొనిచ్చి పెట్టుకోమని చెప్పండి అని రిప్లై ఇస్తే, మరి కొందరు మాత్రం నువ్వు రాత్రి పూట ఇంట్లో ఉండకుండా ఎక్కడకన్నా వెళ్ళిపో అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: