మనోధైర్యమే "కరోనా"కు విరుగుడు ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగిందల్లా జాగ్రత్త వహించడం మాత్రమే. కరోనా తొలిదశతో పోలిస్తే, రెండవ దశ తీవ్రత భారీగా పెరిగింది. ఓ వైపు లాక్ డౌన్, మరోవైపు కఠిన కరోనా నిబంధనలు ఎంత పాటిస్తున్నా ఈ మహమ్మారి అదుపులోకి రావడం లేదు. రోజూ వేలాది మంది కరోనా బారిన పడుతున్నారు. మరోవైపు కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏపీలోని పలు జిల్లాలలో రోజుకు పది మందికి పైగా కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతుండడం భయాందోళనలు కలిగిస్తోంది. అందులోనూ చాలామంది 25- 40 సంవత్సరాల మధ్య లోపు వయస్సు వారు కావడం మరియు వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికీ కూడా కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉండడం కలవరపెడుతోంది.
మరికొందరు కరోనా పాజిటివ్ వస్తే చాలు మానసిక ఒత్తిడి పెరిగి  భయభ్రాంతులకు లోనై ఊపిరి వదిలేస్తున్నారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం కరోనా రాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ వస్తే హోమ్ క్వారంటైన్ లో ఉంటూ డాక్టర్ల సలహా మేరకు మందులు వాడాలి. వీలైనంతవరకు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండే పనులు చేసుకోవాలి. యోగా, ప్రాణాయామం వంటివి అలవర్చుకోవాలి.  ఊపిరి ఆడడం లేదు అని అనిపిస్తే టెన్షన్ పడకుండా ఆక్సిమీటర్ తో చెక్ చేసుకోండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులు తమ వద్ద ఆక్సి మీటర్ ఉంచుకోవడం మంచిది. లేదంటే మన భయమే మనకు ఊపిరి ఆడటం లేదు అనే భావన కలిగించే అవకాశం కూడా ఉంది.

జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అంతే తప్ప అనవసరమైన భయాలను పెంచుకొని ప్రాణం మీదకు తెచ్చుకోకండి. మన మనోధైర్యమే మన ప్రాణాలకు రక్ష. కరోనా వచ్చిన కొంతమంది రోగులను మీరు గమనిస్తే వారి పరిస్థితికి భయపడకుండా ఎంతో ధైర్యంగా ఉంటున్నారు. కొన్ని హాస్పిటల్స్ లో అయితే కరోనా పేషెంట్స్ ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి వారిచేత చిన్న చిన్న గేమ్స్ అందిస్తున్నారు. వారి చేత పాటలు పండిస్తున్నారు. ఇలా చేసినప్పుడు వారి మనసు చైతన్యవంతమవుతుంది. ఎంతటి భయంకరమైన పరిస్థితిని అయినా మన మనోధైర్యంతో ఎంతటి ప్రమాదంనుండైనా బయటపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: