కోవిడ్ హాస్పిటల్స్ వద్ద రోగుల ఇక్కట్లు ? అంతా దోపిడీ మయం ?

VAMSI
దేశంలో ప్రజలు కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయంలో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. పాజిటివ్ కేసులు, కరోనా మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదు అవుతూ రోజురోజుకీ పరిస్థితి చేయిదాటుతోంది. నిత్యం నాలుగువేల మంది కరోనా రోగులు మరణిస్తుండడం ప్రమాద స్థాయిని సూచిస్తోంది. ఆరోగ్య సదుపాయాల కొరత వలన ప్రజలు అల్లాడుతున్నారు. ఇండియాలో విషాధచాయలు అలుముకుంటున్నాయి. కరోనా సోకిన వ్యక్తులు, ఆరోగ్యం క్షీణించి అత్యవసరమైన సమయాలలో హాస్పిటల్లో చేరేందుకు చూస్తే వారికి చుక్కలు చూపెడుతున్నారు హాస్పిటల్ సిబ్బంది.

హాస్పిటల్ లో చేరేందుకు అడ్మిషన్లు దొరక్క నరకాన్ని చూస్తున్నారు. గంటల కొద్దీ క్యూలో నిలబడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక ఆక్సిజన్ కొరత కరోనా రోగులకు శాపంగా మారింది. అత్యవసర సమయంలో కరోనా రోగులు ఆక్సిజన్ కావాలని హాస్పిటల్స్ ముందు పడిగాపులు కాస్తుంటే, కుదరదని ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో లేవని నిర్మొహమాటంగా చెప్పి పంపేస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. దాంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని అడగాలో తెలియని దయనీయ స్థితిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు కరోనా రోగులకు చికిత్స కోసం భారీ మొత్తంలో ఫీజులు డిమాండ్ చేస్తూ ముందే ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు.

ఇక ఆక్సిజన్ అవసరమైతే ఆ ఖర్చు భరించడం సామాన్యుల తరం కాదు. అంతగా చార్జ్ చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. కానీ ఇవేమీ ప్రభుత్వాల కళ్ళకి కనిపిస్తున్నట్లు లేదు. మైకు కనిపిస్తే చాలు అంతా సవ్యంగానే ఉంది, బెడ్స్ కొరత లేదు ప్రస్తుతానికి పెద్దగా ఇబ్బందిలేదంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. వ్యాక్సినేషన్  కార్యక్రమం కూడా అంతంతమాత్రంగానే సాగుతుండటం మరో ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇలా అన్ని రకాల కష్టాలతో సామాన్య ప్రజలు ప్రాణాలతో యుద్ధం చేస్తున్నారు. ఇటువంటి హాస్పిటల్స్ పై చర్యలు తీసుకుంటున్నా, కొన్ని హాస్పిటల్స్ మాత్రం మారడం లేదు. ఇటీవల కొన్ని హాస్పిటల్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: