కరోనా సోకితే ఏంటీ.. మీకు నేనున్నా?

praveen
ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  రెండవ రకం కరోనా వైరస్ ప్రస్తుతం అందరి పై పంజా విసురుతోంది సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా విలయ తాండవం చేస్తుంది ఈ మహమ్మారి వైరస్.  ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా వైరస్ సోకుతూనే ఉంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సోకిన తర్వాత పరిస్థితులు మరీ దారుణం గా మారిపోతున్నాయి. ముఖ్యంగా గర్భిణీలు చిన్న పిల్లలు అయితే మరింత ఇబ్బందులు పడుతున్నారు.

 కరోనా వైరస్ బారిన పడిన గర్భిణీలకు ప్రసవం చేసేందుకు ఎంతోమంది ప్రైవేట్ డాక్టర్లు సైతం ముందుకు రావడం లేదు   ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఎంతో మంది డాక్టర్లు అటు  వైరస్ బారిన పడిన గర్భిణుల విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఏకంగా తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. అందరూ భయపడుతుంటే కరోనా వైరస్ సోకిన గర్భిణీలకు ప్రసవం చేయడానికి కొంతమంది డాక్టర్లు ముందుకు వచ్చి  గర్భిణీలకు అండగా నిలుస్తున్నారు. ఇక్కడ ఓ డాక్టర్ కూడా ఇలాంటి గొప్ప మనసు చాటుకున్నారు.

 కరోనా వైరస్ కష్టకాలంలో కూడా అటు గర్భిణీ స్త్రీలకు ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు.  వైరస్ బారిన పడితే ఏంటి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు మీ కోసం నేను సిద్ధంగా ఉన్నాను అంటూ అందరిలో ధైర్యాన్ని నింపుతున్నారు. కరోనా వైరస్ సోకిన గర్భిణీలకు ఇక ఎంతో సులువుగానే ప్రసవాలు జరుగుతున్నట్లు గా సుల్తానాబాద్ ఆస్పత్రి సూపరిండెంట్ రాజ్యలక్ష్మి చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ కష్టకాలంలో తమ ఆసుపత్రి సిబ్బంది మొత్తం వైరస్ బారిన పడిన గర్భిణీలకు చికిత్స అందించేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఇక వైరస్ బారిన పడిన గర్భిణీ ప్రసవం తర్వాత పిల్లలకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్ రాజ్య లక్ష్మి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: