కేసీఆర్.. కొత్త కరోనా రిపోర్ట్ వచ్చేసింది.. ఏం తేల్చారంటే..?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి  ఆయన తన ఫామ్‌ హౌజ్‌లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వ్యక్తిగత వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయితే ఆయన కొన్నిరోజుల క్రితం హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో సిటి స్కాన్, ఇతర సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎం. వి. రావు ఆధ్వర్యంలో ఈ పరీక్షలను నిర్వహించారు.
ఆ తర్వాత కొన్నిరోజులకు కేసీఆర్ కు కరోనా పరీక్షలు నిర్వహించారని.. యాంటిజన్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని మీడియాకు సమాచారం ఇచ్చారు. దాంతో కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారని పత్రికలు, ఛానళ్లు రాశాయి. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రం ఆర్టీ పీసీఆర్‌లో కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. అందువల్ల కేసీఆర్ కు కరోనా చికిత్స కొనసాగుతుందని మళ్లీ సమాచారం వచ్చింది.
ఇలా కేసీఆర్ తో దోబూచులాడిన కరోనా.. తాజాగా కొత్త రిపోర్టు వచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కరోనా నుంచి పూర్తిగా కోలు కున్నారు. సిఎం కెసిఆర్ ఐసోలేషన్ లో వుంటున్న వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎం వి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం  కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు  రెండింటిలోనూ నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి.
సీఎం కేసీఆర్ రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా వున్నాయని వైద్యులు చెబుతున్నారు. దాంతో  సిఎం కెసిఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు. మొత్తం మీద సీఎం కేసీఆర్ కరోనా నుంచి చాలా వేగంగా కోలుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ పూజలు  చేయిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా యాగాలు కూడా చేశారు. అవన్నీ ఫలించినట్టే అన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: