ఊరి జనాభా 1400.. కరోనా కేసులు 600.?

praveen
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. శరవేగంగా వ్యాప్తిచెంది అందరిపై పంజా విసురుతోంది. ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల ఎంతో అవగాహనతో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి మాత్రం పంజా విసురుతోంది. ఎంతోమంది ఈ వైరస్ బారినపడి అల్లాడిపోతున్నారు.  వెరసి తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యలను పకడ్బందీగా అమలు చేయకపోవడం కూడా వైరస్ కేసులు పెరిగిపోవడానికి కారణం అని చెబుతున్నారు విశ్లేషకులు.

 ముఖ్యంగా కొన్ని కొన్ని గ్రామాలలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. అయితే గత ఏడాది మొదటి రకం కరోనా వైరస్ కేసులు పట్టణాలు నగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి. కానీ గ్రామాల వరకు సోకలేదు   రెండవ రకం కరోనా వైరస్ మాత్రం పట్టణాలు నగరాల తో పాటు గ్రామాలకు కూడా  సోకటంతో గ్రామాల్లో  మహమ్మారి వైరస్ పట్ల తక్కువగా అవగాహన ఉండటం కారణంగా శరవేగంగా గ్రామాల్లో మొత్తం కరోనా వైరస్ నీడలు కమ్ముకుంటున్నాయి. ఇక అవగాహన లేమి కారణంగా కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే మరింత దారుణ పరిస్థితులు నెలకొంటున్నాయి ఇక్కడ ఇలాంటి పరిస్థితి నెలకొంది.

 తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ఎర్రవల్లి లో కరోనా వైరస్ కోరల్లో చిక్కుకొని గ్రామం విలవిల్లాడిపోతోంది. ఆ గ్రామం పై కరోనా వైరస్ ప్రభావం ఎంత చూపింది అంటే గ్రామం లో పూర్తి జనాభా 1400 మంది కాగా ఇప్పటివరకు 600 మందికి కరోనా వైరస్ సోకింది. అంతే కాదు వారం క్రితం వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ గ్రామం అవతలికి వెళ్ళిపోయి పొలంలో గుడిసెలు వేసుకుని ఇక క్వారంటైన్ లో గడుపుతున్నారు. కొంతమంది పరిస్థితి కూడా మరింత దయనీయంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి  వైరస్ పరీక్షలు చేయాలని చెప్పినప్పటికీ అధికారుల నుంచి మాత్రం స్పందన కరువైంది అని అటు గ్రామస్తులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: