ఈటెల ఎపిసోడ్ ఎండ్...

Purushottham Vinay
ఈటెల రాజేందర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రిగా మంచి పేరుని అలాగే మంచి వివేకమైన మంత్రిగా గుర్తింపుని తెచ్చుకున్నారు. ఇక కేసీఆర్ ఈటెల రాజేందర్ ని అవమానకర రీతిలో బయటకి పంపించారు. ఇక నిజానికి కేసీఆర్ కుటుంబంలో ఆధిపత్య పోరు నడుస్తోందని ఎప్పటినుంచో మీడియాలో వార్తలు బాణాల్లా దూసుకొస్తూనే ఉన్నాయి. మంత్రి కేటీఆర్‌కు, ఎంపీ సంతోష్ కుమార్ మధ్య అభిప్రాయ విభేదాలున్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కేటీఆర్‌ను సీఎం చేయాలని డిమాండ్లు వచ్చిన సమయంలో సంతోష్ కుమార్ చక్రం తిప్పారని, అందుకే కేటీఆర్‌కు సీఎం పదవి దక్కలేదని అప్పట్లో రూమర్లు వినపడ్డాయి. అయితే కేటీఆర్ సీఎం ఎపిసోడ్‌లో ఈటెల కూడా ఉన్నారని టీఆర్ఎస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.కానీ ఎంపీ సంతోష్‌తో ఉన్న విభేదాలతో కేసీఆర్, ఈటెల మధ్య సాన్నిహిత్యం చెడిపోయిందనే వాదనలు ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి.

ఇక ఇటీవల అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఈటెలను శాంతింపజేస్తూ కేటీఆర్ స్వయంగా ప్రగతి భవన్ తీసుకెళ్లగా..అంతటితో ఈటల వెనక్కితగ్గుతారని అందరూ భావించడం జరిగింది. కానీ ప్రగతి భవన్ ఇన్నర్ గేట్ వద్దే ఈటెలను ఆపేశారని, దాదాపు గంటపాటు ఆయన అక్కడే ఎదురు చూసినా ఫలితం లేకపోవటంతో అవమానంగా భావించి ఈటెల అక్కడి నుండి వెళ్లిపోయారని టీఆర్ఎస్ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ప్రగతి భవన్ ఎపిసోడ్‌లో సంతోష్ కీ రోల్ పోషించారని కూడా చెప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా కాని ఈటెల ని ఇలా అవమానించి బయటకి తొలగించడం అనేది ఇప్పుడు చాలా షాకింగ్ గా మారింది. మొత్తానికి ఈటెల ఎపిసోడ్ కి ఎండ్ కార్డు పడింది.తెలంగాణా రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రిగా పలు నిధులు నిర్వర్తించిన ఈటెల కి ఇది ఘోర అవమానం అనే చెప్పాలి.ఇక తరువాత ఈ విషయం గురించి ఎలా స్పందిస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: