అందరు హడావిడి చేసి.. ఇప్పుడు ఒక్కరిదే బాధ్యత అంటారేంటి..?

praveen
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఓవైపు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నా బీజేపీ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక ఢిల్లీ పెద్దలు అందరూ మమతా బెనర్జీ పార్టీ ని నేలకేసి కొట్టి ఇక బెంగాల్ ప్రజలందరినీ తమ వైపు తిప్పుకుని ఘన విజయం సాధించాలని ఎంతో వ్యూహాత్మకంగానే వేసినప్పటికీ  బీజేపీ వ్యూహం ఫలించలేదు అన్నది ఇటీవలే వెలువడుతున్న ఫలితాల్లో తెలుస్తోంది.


 ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు ఉదయం నుంచి ప్రారంభం కాగా వివిధ రౌండ్లలో ఫలితాలు వెలువడుతున్నాయి.  ఇక ఈ ఫలితాలలో మొదటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ. బెంగాల్ లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. అయితే ఎంతో సత్తా చాటాలి అని ప్రయత్నించిన బీజేపీ కి మాత్రం షాక్ తప్ప లేదు అని చెప్పాలి.



 బెంగాల్ లో వస్తున్న ఫలితాలపై ఇటీవలే పశ్చిమ బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు. ట్రెండ్స్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేదని ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉందని గెలుస్తామనే ఆశాభావం తమలో ఉంది అంటూ దిలీప్ ఘోష్ వ్యాఖ్యానించారు. అయితే అటు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం బిజెపి పెద్దలు అందరు రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తే ఇక ఓన్లీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్  మాత్రమే బాధ్యత వహిస్తా అని చెబుతూ ఉండడం మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: