మే 15 వరకు స్లాట్లు ఖాళీ లేదంటున్న యాప్..

Satvika
కరోనా తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే.. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.. ఈ మేరకు ప్రభుత్వం వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చింది. అయితే, మొదట్లో మాత్రం వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లకు కరోనా పాజిటివ్ రావడమో.. లేక చనిపోవడం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావాడమో జరగడం వల్ల జనాలు వ్యాక్సిన్ వేయించుకోవడం లో వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు పెరగడం తో వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు. 


హైదారాబాద్ లో వ్యాక్సిన్ కోసం చూస్తే ఎక్కడా ఖాళీ లేని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌లో 110 కేంద్రాలు, మేడ్చల్‌ జిల్లాలో 20, రంగారెడ్డి జిల్లాలో 49 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ చెబుతోంది. మూడు జిల్లాల్లో 15.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా మూడు జిల్లాల్లో సగం కేంద్రాల్లోనూ వ్యాక్సిన్‌ దొరకని పరిస్థితి. వ్యాక్సిన్‌ వచ్చినా, 50-80 మందికి వేసి అయిపోయిందని చెబుతున్నారు. మిగతావారంతా వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. 


హైదరాబాద్‌లో 110 కేంద్రాలు, మేడ్చల్‌ జిల్లాలో 20, రంగారెడ్డి జిల్లాలో 49 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ వేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే మూడు జిల్లాల్లో 15.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా మూడు జిల్లాల్లో సగం కేంద్రాల్లోనూ వ్యాక్సిన్‌ దొరకని పరిస్థితి. వ్యాక్సిన్ వచ్చినా, 50-80 మందికి వేసి అయిపోయిందని చెబుతున్నారు. మిగతావారంతా వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది.. 


ముందుగా ప్రభుత్వం ప్రకటించినట్లు 45 ఏళ్లు పై బడిన వారికి మాత్రమే స్లాట్లూ తతెరుచుకున్నాయి. కానీ 18 ఏళ్లు పైబడిన వారికి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వ్యాక్సిన్‌ వేస్తున్న పీహెచ్‌సీలు, ఆసుపత్రుల్లో మే 15వరకు స్లాట్లు లేవని యాప్‌లో చూపిస్తోంది. ఆయా కేంద్రాల్లో 100 నుంచి 200 మధ్య స్లాట్లు కేటాయించారు. ఇవి పూర్తిగా నిండిపోయాయి. తమకు ఎప్పటికీ టీకా లభిస్తుందోనని ఆందోళనలో ఉన్నారు. మొదటి డోస్ కు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఇక మిగిలిన వారికి ఎక్కడ న్యాయం జరుగుతుందని అంటున్నారు..మరీ ప్రభుత్వం ఈ విషయం పై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: