పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

VUYYURU SUBHASH
``మా నాయ‌కుడు స్టాన్ ఫ‌ర్డ్‌లో చ‌దివాడ‌న్న మాటే కానీ.. పొగ‌డ్త‌కు-తిట్ల‌కు తేడా తెలియ‌డం లేదు. ఇలా అయితే.. ముందు ముందు రాజ‌కీయాలు ఏం చేస్తాడు!``-ఇదీ.. టీడీపీ సీనియ‌ర్ల మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో వినిపిస్తున్న కామెంట్లు. కొంద‌రు ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌హిరంగంగానే చేస్తుంటే.. మ‌రికొంద‌రు మాత్రం సైలెంట్‌గా ఫోన్లు చేసుకుని మ‌రీ కిసుక్కున న‌వ్వుకుంటున్నారు. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో టీడీపీ యువ నాయ‌కుడు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్‌.. దూకుడు గా ఉంటున్నారు. ప్ర‌భుత్వాన్ని పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు.
మ‌రీ ముఖ్యంగా ఎప్పుడు ఎప్పుడు ఏ ఛాన్స్ చిక్కినా ఆయ‌న వ‌దిలి పెట్ట‌డం లేదు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు, జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే.. లోకేష్ దూకుడుకు త‌గిన విధంగా వైసీపీ నాయ‌కులు కూడా కౌంట‌ర్లు ఇస్తున్నా రు. అదేస‌మ‌యంలో వైసీపీ మీడియా కూడా లోకేష్‌పై చిత్ర‌మైన వార్త‌లు ప్ర‌చారం చేస్తోంది. ఈ క్ర‌మంలో లోకేష్ స‌న్న‌బ‌డ్డాడ‌ని, ఆయ‌న ఆహార్యం మారోపోయిందని.. యూత్‌ను ఆక‌ర్షించేలా లోకేష్ మారుతున్నాడ‌ని పేర్కొంటూ.. ఓ 20 నిముషాల క‌థ‌నాన్ని ఇటీవ‌ల వైసీపీ మీడియా ప్ర‌సారం చేశారు. ఇది.. టీడీపీ నేత‌ల‌కు చెందిన సోష‌ల్ మీడియాలోనూ వ‌చ్చింది.
ఇక‌, ఇది ఆనోటా ఈనోటా.. ప‌డి.. ఏకంగా లోకేష్ ఫోన్‌కు కూడా వెళ్లింద‌ట‌. దీనిని చూసుకున్న లోకేష్ ఇక‌.. అప్ప‌టి నుంచి వైసీపీ మీడియా విలేక‌రులు వ‌చ్చే వ‌ర‌కు త‌న మీడియా స‌మావేశాల‌ను ప్రారంభించ‌డం లేదు. దీంతో ఏమైంది?  ఇంత మార్పు ఎలా వ‌చ్చింది అని టీడీపీ సీనియ‌ర్లు దృష్టి పెట్టారు. త‌న‌ను భారీ ఎత్తున వైసీపీ మీడియామోసేస్తోంద‌ని.. గ‌తంలో తిట్టినా.. ఇప్పుడు మారుతోంద‌ని.. ఇది త‌న‌కు మంచిదేన‌ని.. లోకేష్ భావిస్తున్నార‌ట‌. ఇదే విష‌యం సీనియ‌ర్ల ద‌గ్గ‌ర చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీంతో వారు కూడా స‌ద‌రు కార్య‌క్ర‌మాన్ని ఒక‌టికి రెండు సార్లు చూసి.. కార్య‌క్ర‌మం చివ‌ర‌లో నాలుగు నిముషాలు.. లోకేష్‌ను ఏకేసిన తీరును చూసి న‌వ్వుకున్నార‌ట‌.
 పైకి ఆహార్యం మార్చినా.. లోక‌ష్ వ్య‌వ‌హార శైలిలో ఏమాత్రం మార్పు రాలేద‌ని.. వైసీపీ మీడియా క‌థ‌నం స్ప‌ష్టం చేసింది. దీంతో అస‌లు విమ‌ర్శించేందుకు, లోకేష్ గాలి తీసేసేందుకు ప్ర‌సారం చేసిన వీడియోలో అస‌లు విష‌యాన్ని చిన్న‌బాబు వ‌దిలేసి.. పొగ‌డ్త‌లు తీసుకున్నాడ‌ని, విమ‌ర్శ‌ల‌కు పొగ‌డ్త‌ల‌కు ఆయ‌న‌కు తేడా తెలియ‌డం లేద‌ని సీనియ‌ర్లు న‌వ్వుకుంటున్నారు. ఇదీ సంగ‌తి!! మ‌రి లోకేష్ విమ‌ర్శ‌లేనా.. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల్లోని విష‌యాన్ని గ్ర‌హిస్తారా?  అని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: