తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రళయం ఆగాలంటే.. అదొక్కటే మార్గం..?

praveen
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. అయితే ఒకప్పుడు కరోణ వైరస్ పై ఎలాంటి అవగాహన లేని సమయంలో తెలుగు రాష్ట్రాలు వైరస్ నియంత్రించడంలో ఎంతగానో విజయవంతం అయ్యాయి అని చెప్పాలి. కానీ ప్రస్తుతం వైరస్ నియంత్రణలో పూర్తిస్థాయి అవగాహన ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం వైరస్ ను కంట్రోల్ చేయడంలో విఫలం అవుతున్నాయి అని అంటున్నారు విశ్లేషకులు.

 తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారమే కారణం అని అంటున్నారు. గత ఏడాది ఇదే సమయంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఉంటే ఒక రోగిని గుర్తించిన తర్వాత గత కొన్ని రోజుల నుండి అతను ఎవరెవరు ని కలిశాడు అన్న విషయాన్ని కూడా ట్రేసింగ్ చేసే వారని.. ఇలా ట్రేస్ చేసి ఇక ఆ వ్యక్తి అంతకుముందు కొన్ని రోజుల వరకు కలిసి ఉన్న వ్యక్తులందరూ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంచి   కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేవారు అంటూ గుర్తుచేస్తున్నారు విశ్లేషకులు.

 ఇలా కరోనా వైరస్ రోగిని శరవేగంగా గుర్తించడమే కాదు ఇక ఆ వ్యక్తితో కలిసి ఉన్న మిగతా వ్యక్తులను కూడా ట్రెసింగ్ చేసి గుర్తించడం వల్ల వైరస్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయని కానీ ప్రస్తుతం సెకండ్ వేవ్ ఎంతో మందిని బలితీసుకుంటూ ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా ఇలాంటి చర్యలకు సిద్ధం కాలేదు అని చెబుతున్నారు. కరోనా వైరస్ పై పూర్తి స్థాయి అవగాహన వచ్చిన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలా వ్యవహరించడం ఏమాత్రం బాలేదని ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరింత విపత్కర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు అందుకే వైరస్ రోగులను గుర్తించడమే కాదు ఇక వారితో అంతకుముందు వరకు కలిసిన ఇతర వ్యక్తులను ట్రేసింగ్ ప్రక్రియ కూడా చేపడితే బాగుంటుంది   అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: