ప్రస్తుతం ఎక్కడ విన్నా కూడా ఒకటే మాటే కరోనా.. అడుగు పెట్టడానికి వీలు లేకుండా మృత దేహాల తో నిండిపోయింది. ఇకపోతే ఈ వ్యాధిని కొన్ని రకాల నాటు మందుల తో ఈ వ్యాధిని అరికట్టవచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.. అదేంటో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. తిప్ప తీగ.. ఈ పేరు ను పల్లెల్లో ఎక్కువగా వింటారు.పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లూ ఈ తీగ గొప్పదనం ఎక్కువమందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ కరోనా పంజా విసురుతున్న వేళ కచ్చితంగా తెలుసుకొని తీరాలి.
తిప్పతీగను అమృత, గుడూచి అని కూడా అంటారు. తమలపాకు రూపంలో చిన్నగా ఉండే ఈ ఆకులో విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు తప్పక తెలుసుకోవాలి.. తిప్పతీగ ఆకులను బాగా నూరి గోలీకాయ అంత ఉండలు చేసి 10 రోజుల పాటు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రోగని రోధక శక్తి బాగా పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు ఢంకా బజాయించి మరీ పేర్కొంటున్నారు.. మరో విషయమేంటంటే ఈ ఆకుల ను తీసుకోవడం వల్ల జ్వరం రమ్మన్నా కూడా రాదట..
ఆయుర్వేద శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం తిప్పతీగ ఆకులను 'శంశమినివటి' అనే పేరు తో మందులుగా తయారుచేసి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.కిడ్నీ సంబంధిత జబ్బులు, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల ను తగ్గించేందుకు ఉపయోగించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ తిప్ప తీగకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి.. ఈ తీగ ఆకులు, కాండం, చివరికి వేర్లు కూడా మంచి ఔషదం అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.. చూసారుగా చిన్న చేసే బోలెడు మేలు.. ఇప్పటి నుంచైనా తిప్పతీగ ను వాడటం అలవాటు చేసుకోవడం మేలు..కరోనా రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిది..