పుట్టినరోజు నాడే చంద్రబాబుకు షాక్..!

Suma Kallamadi
టీడీపీ పార్టీ జాతీయ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటితో 71 ఏళ్లు పూర్తి చేసుకుని 72వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా చాలామంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టారు. అయితే చంద్రబాబు తన పుట్టినరోజు సందర్భంగా అందరి నుంచి మంచి శుభాకాంక్షలు అందుకున్నారు కానీ ట్విట్టర్ లో మాత్రం ఆయనకు ఊహించని షాక్ తగిలింది.

#HBDCBN అనే హ్యాష్ ట్యాగ్ తో చంద్రబాబు బర్తడే విషెస్ ట్రెండ్ కావాల్సింది పోయి #HBDTelugu420CBN ట్రెండ్ తో వేలాది ట్వీట్స్ ట్విట్టర్ ని షేక్ చేస్తున్నాయి. వైసీపీ సానుభూతిపరులతో పాటు మరికొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు కి పుట్టినరోజు నాడే షాక్ ఇస్తున్నారు. #HBDTelugu420CBN ట్రెండ్ ట్విట్టర్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండటం మరొక విశేషం.


ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ సానుభూతిపరులు, చంద్రబాబు వీరాభిమానులు తమ ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ని ఇలా అగౌరవ పరుస్తున్నారా అని వారు కూడా కౌంటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. పుట్టినరోజు నాడు ఇలా చేయడం తగదని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు.


అయితే విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే అతి పెద్ద షాక్ ఇచ్చారు. ‘ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం టీడీపీ మద్దతుదారులు ఆగ్రహ జ్వాలలు రేకెత్తిస్తున్నాయి. టీడీపీ తమ్ముళ్ళు కూడా తమదైన శైలిలో విజయసాయి రెడ్డి కి కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా ట్విట్టర్ లో చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు నాడే చేదు అనుభవం ఎదురయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: