మోడీ గారూ.. ఇప్పుడైనా పరిష్కరించండి సారూ.. ఈటెల రిక్వెస్ట్..?

praveen
దేశంలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. అయితే వ్యాక్సినేషన్  కోసం రెండు రకాల టీకాలకు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. అయితే మొదటి విడతలో భాగంగా కరోనా వారియర్స్ కి వ్యాక్సిన్ అందించగా రెండో విడతలో భాగంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి వాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం.

 ఇక మూడో విడతలో భాగంగా 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు నిర్ణయించింది. అయితే ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వ్యాక్సిన్లు కొరత కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల వ్యాక్సిన్ల కొరత   ప్రభుత్వానికి అయోమయంలో పడేస్తోంది.  తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన వ్యాక్సిన్లు కొరత పై స్పందించిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రాన్ని వ్యాక్సిన్ లపై రిక్వెస్ట్ చేశారు.

 తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత రోజురోజుకు తీవ్రతరం అవుతుందని కేంద్రం స్పందించి వెంటనే పరిష్కరించాలి అంటూ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. తెలంగాణలో రోజుకు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ టీకాలు అందుబాటులో లేక ఆదివారం వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చారు. 25 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించాలి అని అటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కు రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు వరకు స్పందన లేదు అంటూ చెప్పుకొచ్చారు ఈటెల రాజేందర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: