టీడీపీ నాయకుడు దేవినేని ఉమాకు సైబర్ క్రైమ్ ఉచ్చు...?

VAMSI
ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రస్తుతం ఏపీలో చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఇలా జరగడానికి రాజకీయంగా చాలా కారణాలు ఉన్నాయి. అయితే టీడీపీకి ఏదీ కలిసి రావడం లేదని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికలయితే అస్సలు వీరికి అనుకూలంగా ఉండట్లేదు. ఏపీలో మొన్నీమధ్యనే జరిగిన గ్రామ పంచాయతీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యవహారం బెడిసి కొట్టింది. రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలను మూటగట్టుకుంది. దీనికి తోడు పార్టీ అధ్యక్షుడయిన చంద్రబాబు నాయుడు కూడా ఇంతకు ముందులా ప్రభావవంతంగా కనిపించడం లేదు. ఇలా వివిధ కారణాలతో టీడీపీ నాయకులు సైతం పూర్తిగా లయ తప్పినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా పార్టీలో ఒక నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. దీనితో పార్టీలో నమ్మకంగా కొంతమంది మాత్రమే ఇప్పుడు మిగిలారు. అలాంటి వారిలో టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా ఒకరు. అయితే తాజాగా జరిగిన పరిస్థితులు చూస్తే  అధికార పార్టీ దేవినేని ఉమను కూడా టార్గెట్ చేసినట్లుగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈయనకు మొన్ననే సిఐడి వారు పోలీసు నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. విషయం ఏమిటంటే...జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలను...  దేవినేని ఉమా ఫోకస్ చేసి పోస్ట్ పెట్టినట్లుగా తెలుస్తోంది.  అంతే కాకుండా ఈ నోటీసు అందిన అర్ధ గంటలోనే  విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో ఉన్నట్లు తెలుస్తోంది.  
కానీ ఉమా మాత్రం దానికి ఆలస్యంగా స్పందించి తాజాగా ఒక లెటర్ పంపారు. నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి. ఒక పది రోజులలో నేను విచారణకు హాజరవుతానని ఆ లెటర్ లో చెప్పారు ఉమా. అయితే సి ఐ డి వారు మళ్ళీ ఉమాకు నోటీసు ఇచ్చారు..వెంటనే రావాలని వచ్చే ముందు ఆ ఆరోపణకు సంబంధించిన ఒరిజినల్ మరియు అతని ఫోన్ ను తీసుకురమ్మన్నారు. అయితే ఈ లోపు విజయవాడ సైబర్ క్రైమ్ వారు టీడీపీ డిజిటల్ విభాగానికి కూడా నోటీసును పంపించారు. ఈ లేఖలో టీడీపీ వారు సోషల్ మీడియాలో తిరుపతి ఎంపీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తిపై అభ్యంతరకరమైన పోస్ట్ ను పెట్టారు. ఈ పోస్ట్ ఎవరు పెట్టారు..దీనికి అడ్మిన్ ఎవరు అన్ని నోటీసును పంపారు.
అంతే కాకుండా ఆ నోటీసులో ఈ కేసు సవ్యంగా పూర్తి కావడానికి అవసరమైన సమాచారం ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.  అయితే టీడీపీ సైబర్ గ్రూపుకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలియాల్సి ఉంది. గతంలో అయితే లోకేష్ ఈ సైబర్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ప్రతి చిన్న విషయానికి కేసులు అవుతుండడంతో ఇప్పుడు లోకేష్ లేరు. ఇటువంటి సమయంలో టీడీపీ ఏ విధంగా స్పందించనుందో తెలియాల్సి ఉంది. పార్టీ పాత్ర ఉందని ఒప్పుకుంటుందా...? లేదా వ్యక్తులు చేసిన తప్పు కాబట్టి...ఎలా చేస్తుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: