మొదటిసారి వెయ్యి.. రెండవ సారీ 10 వేలు.. మాస్క్ పెట్టుకోకుంటే జేబుకు చిల్లే..?

praveen
ప్రజలు మరోసారి కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. మొన్నటి వరకు దేశంలో కరోనా వైరస్ అతి తక్కువగా ఉందని దేశ ప్రజానీకం ఊపిరిపీల్చుకుంది. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ   ప్రారంభమైందని  ధైర్యం నిండిపోయింది. ఇలాంటి సమయంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కోరలు చాస్తూ శరవేగంగా వ్యాప్తిచెందుతూ ఉండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది గత ఏడాది ఈ సమయానికి ఎలా అయితే  వైరస్ విజృంభించిందో   ప్రస్తుతం దేశంలో మళ్లీ అలాంటి పరిస్థితులే వస్తున్నాయని చెప్పాలి.  ఈ క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కరోనా ను వైరస్ కంట్రోల్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

 ముఖ్యంగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా  వైరస్ ను కంట్రోల్ లోకి తెచ్చేందుకు కఠిన ఆంక్షలను  మరోసారి తెరమీదకు తెస్తున్నారు.  ఇక ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని అంతేకాకుండా భౌతిక దూరం పాటించాలి అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నాయి. అయితే మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ  వైరస్ కారకులుగా మారిపోతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించేందుకు కూడా మార్గదర్శకాలను విడుదల చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇప్పటికే కణ వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న దృశ్య మాస్కులు ధరించి కాకపోతే దాదాపు వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.

 అయితే ఇటీవలి కాలంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడంతో ఇటీవలే యూపీ సర్కారు కఠిన నిర్ణయం అమలులోకి తెచ్చింది. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి వెయ్యి రూపాయలు జరిమానా విధించేందుకు సిద్ధమైంది అయితే ఇక జరిమానా విధించినా పదే పదే ఇలాంటి తప్పులు చేస్తూ మాస్కు ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రెండవ సారి మాత్రం పది వేల రూపాయల జరిమానా విధించాలని యూపీ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకుంది.  ప్రతి ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ ఉంటుందని.. ఆ రోజులో ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ యూపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: