వైసీపీ మంత్రి సవాలుకు జడుసుకున్న టీడీపీ...?

VAMSI
ఏపీలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం రకరకాల వ్యూహాలను పన్నుతున్నాయి. ఇందులో భాగంగానే వైసీపీ నాయకుడు మరియు మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫస్ట్ టైం ఒక నిర్మాణాత్మకమైనటువంటి సవాల్ విసిరారు. ముందుగా ఈయన గురించి చెప్పుకుంటే రామచంద్రా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం కావొచ్చు లేదా చిత్తూరు జిల్లా కావొచ్చు...ఒక పాతకాలం దొరలు, ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో ఆ విధంగా ఈయన తీరు ఉంటుంది.  ఈయన స్వభావం ఆకూడా అదే విధంగా ఉంటుంది. ఈయన ప్రాంతం అంతా తన చేతుల్లోనే ఉండాలనుకుంటాడు. 


సాధారణంగా ఇప్పటి కాలంలో పరిస్థి ఒక్క రాజకీయ నాయకుడు ఇదే విధంగా అనుకుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ,  మిగతా ప్రాంతాలలో అదే పరిస్థితి ఉండదు కదా...కానీ అక్కడ వేరే నియోజకవర్గాలకు వెళ్లి తన అధిపత్యాన్ని ప్రదర్శిస్తే అక్కడ నాయకులకు కొంతమేరకు కోపం కలిగే అవకాశం లేకపోలేదు. మరియు వేరే నాయకులకు విరక్తి కలిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే గతంలో ఒక రాజకీయనాయకుడిగా సక్సెస్ కాలేక, ఫ్యాక్షన్ రాజకీయాలతో ఈ స్థాయికి వచ్చాడని ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ తరహా ధోరణి కొన్ని సమయాల్లో తన వ్యక్తిత్వానికి మరియు అధికారానికి విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.  


 విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈయన విసిరిన సవాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఫస్ట్ టైం తిరుపతి ఉప ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ఒక నిర్మాణాత్మకమైన స్టేట్ మెంట్ ఇచ్చింది ఇప్పుడే. అది ఏమిటంటే... తెలుగుదేశం పార్టీకి ఈయన ఓ సవాల్ విసిరారు ... అయితే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వివేకా హత్యపై చేసిన ప్రమాణం సవాలు వైరల్ అవుతున్న సందర్భంలో ఈ  తిరుపతి సీటు గనుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిస్తే.... మేము 22 మంది ఎంపీలము రాజీనామా చేస్తాం.  అలాగాక గురుమూర్తిగారు గెలిస్తే మీ ముగ్గురు ఎంపీలు కాకుండా మీకు మద్దతిస్తున్నటువంటి రఘురామకృష్ణ రాజు కూడా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. మరి ఈ సవాళ్ళ మధ్య ఎవరిని గెలుపు వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: