జనగామలో బయటపడ్డ లంకె బిందె....

frame జనగామలో బయటపడ్డ లంకె బిందె....

Purushottham Vinay
మన పురాతన సంపద ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడంటే కాలంతో పాటు జనాలు కూడా కాగితాల నోట్లకు విలువ ఇస్తున్నారు కాని ఆరోజుల్లో సంపద అంటే వజ్రాలు, వైడూర్యాలు, ఇంకా లంకె బిందులు, బంగారు నాణాలు అని చెప్పాలి. అప్పట్లో అవి మన పెద్ద వాళ్ళు చాలా సులభంగా సంపాదించేవాళ్ళు. ఇక వాటికి విలువ కూడా చాలా ఎక్కువే. ఇక ఈరోజుల్లో అలాంటివి అరుదు కావడంతో వాటి విలువ ఇంకా బాగా పెరిగింది. అవి ఇప్పుడు బయటపడితే చాలు దొరికిన వాళ్ళు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. ఇక తాజాగా ఆ పురాతన సంపద దొరికింది. తెలంగాణాలో జనగామ మండలం పెంబర్తి గ్రామంలో లంకె బిందె బయటపడింది. నరసింహ అనే వ్యక్తి నెలరోజుల క్రితం రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం స్థానికంగా 11 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో ప్రొక్లెయిన్‌ తీసుకువచ్చి భూమిని చదును చేస్తున్న సమయంలో ఆటంకం ఏర్పడగా, కాస్త తవ్వి చూడటంతో లంకె బిందె వెలుగుచూసింది.


 ఇందులో సుమారు 5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ దేవతా మూర్తులకు అలంకరించినవని భావిస్తున్నారు.కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇక పెద్ద మొత్తంలో నిధి లభించడంతో స్థానికులు పెద్ద ఎత్తున సదరు వెంచర్‌ వద్దకు చేరుకుంటున్నారు. కళ్లు చెదిరే ఉన్న బంగారు ఆభరణాలను చూస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై నిజాలు వెలికితీసేందుకు పురావస్తు శాఖకు సమాచారం అందించారు.ఈ విషయం తెలుసుకున్న పురావస్తు శాఖ వారు అక్కడికి చేరుకొని పరిశీలించడం జరిగింది. ఇక ఈ విధంగా మన పురాతన సంపద అప్పుడప్పుడు బయట పడుతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: