తండ్రిని అనాథను చేసిన కొడుకులు.. ఏం చేసారో తెలుసా..?
అయితే కొంతమంది తల్లిదండ్రులను తమతోపాటు ఉంచుకోలేక వృద్ధాశ్రమంలో వదిలేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులను వదిలించుకోవడానికి ఎంతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఓ కొడుకు చేసిన పనికి ప్రస్తుతం అందరు షాక్ అవుతున్నారు.. చిన్నప్పటి నుంచి ఆలనాపాలనా చూస్తూ ఏ చిన్న సమస్య కూడా రాకుండా పెంచి పెద్ద చేసిన నాన్న విషయంలో కొడుకులు కసాయిలు గా మారిపోయారు. వృద్ధాప్యంలో ఆ తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన కొడుకులు చివరికి కనీస కనికరం లేకుండా ప్రవర్తించారు.
చివరికి వృద్ధాప్యంలో కూడా ఆ తండ్రి పున్నామ నరకం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కన్న తండ్రిని కొడుకులు అడవిలో వదిలేసిన ఘటనా వికారాబాద్ లో చోటుచేసుకుంది. నర్సింగ్ కు చెందిన స్వాములు అనే అరవై ఏళ్ల వ్యక్తికి ఇద్దరు కొడుకులు అయితే తండ్రిని వదిలించుకోవాలి అంటూ భార్యలు పోరు పెట్టడంతో ఇక తండ్రిని తీసుకెళ్లి నిర్మానుష్యమైన అడవిలో వదిలేశారు. అయితే ఎన్నో ఆపసోపాలు పడుతూ చివరికి వికారాబాద్ చేరుకోగలిగాడు వృద్ధుడు. అయితే అతని సమస్యలు విన్న ఒక హోటల్ యజమాని అతనికి సహాయం చేశాడు ప్రస్తుతం ఆయన నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.