ఎండాకాలం బండి జాగ్రత్త సుమీ.. లేదంటే ప్రాణం పోద్ది..?

praveen
ఎండాకాలం వచ్చింది అంటే చాలు భానుడి భగభగ నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు జనాలు. ఓవైపు పైనుంచి భగభగమండే వేడి తగులుతూ ఉంటే ఇక ఏదో విధంగా చల్లదనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఏసీలు కూలర్లు అంటూ ఎన్నో రకాలు వాడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఇలా ఏదో ఒక విధంగా సూర్యుడు వేడి నుంచి తప్పించుకుని ఉపశమనం పొందడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు జనాలు.  మనుషులు అయితే ఇలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసు. కానీ వాహనాల విషయంలో మాత్రం కొంత మంది ఎండాకాలంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు.

 అయితే ఇప్పటికే ఎండాకాలం ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్న తరుణంలో మరికొన్ని రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇక వాహన దారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాల మీదికి వచ్చే అవకాశం ఉంది అని చెబుతున్నారు నిపుణులు.  ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో వాహనదారులు అందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఈ హెచ్చరికలు ఎందుకు అని అంటున్నారా..  ఎండాకాలంలో ఓవైపు సూర్యుడు భగ భగ మండిపోతు అంటే అటు వాహనాలకు గడ్డుకాలమే అని చెప్పాలి.  ఎండ వేడికి అటు రోడ్డు వేడితో అట్టుడికిపోతోంది..  అదే సమయంలో ఈ మధ్యకాలంలో వాహనాలు కూడా భగ్గుమంటున్నాయి.

 ఎండ వేడికి తెలుగు రాష్ట్రాలలో కేవలం నెలరోజుల వ్యవధిలోనే 10 వాహనాలు కాలిపోయాయి.  ఇక ఎండవేడికి ఇంజన్లలో పెట్రోల్ నిల్వ ఉండటం కారణంగా మంటలు చెలరేగుతూ ఉండడం.. ఇలాంటి సమయంలో వాహనదారులు అప్రమత్తంగా లేకపోవడంతో ఇక చివరికి ప్రాణాలు పోవడం లాంటి ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అందుకే కార్ అయినా టూవీలర్ అయినా సరే రెగ్యులర్గా సర్వీసింగ్ చేయించడం అంతే కాకుండా టైర్లు ఆయిల్ కూలెంట్ లాంటివి చెక్ చేసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి అని సూచిస్తున్నారు నిపుణులు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అజాగ్రత్త పెను ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: