వ్యాక్సిన్ వేసుకుంటే ముక్కుపుడుక ఫ్రీ.. ఇక అబ్బాయిలకేమో..?

praveen
ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తూ శరవేగంగా మరో సారి వ్యాప్తి చెందుతున్న తరుణం లో వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగం గా జరిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే దేశం లో రెండు రకాల వ్యాక్సిన్లను అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియ లో భాగంగా మొదట కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన కరోనా వారియర్స్ కి అందజేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆ తర్వాత రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 65 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించింది.

 ఇక ఇటీవలే 45 ఏళ్ల పైబడిన వారికి మూడో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్న విషయం తెలిసిందే.  అయితే వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన మొదట్లో అటు ప్రతిపక్ష పార్టీలు వ్యాక్సిన్ విషయంలో గందరగోళం సృష్టించడంతో ప్రజలందరిలో కూడా టీకా అసలు సురక్షితమైనదేనా అనే అనుమానం నెలకొంది. అయితే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన చేపట్టడంతో వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎంతో మంది ముందుకు వచ్చారు. కానీ ఇప్పటికీ కూడా  ఎంతోమంది వ్యాక్సిన్ విషయంలో ఇప్పటికీ కూడా భయపడుతూనే ఉన్నారు.

 వివిధ కారణాలతో టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు వచ్చే విధంగా.. కొన్ని ఆఫర్లను కొంత మంది స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు ఇటీవలే గుజరాత్లోని సూరత్లో వ్యాక్సిన్ చేయించుకోవడం ప్రోత్సహించేందుకు  నగర స్వర్ణకార సంఘం ఒక వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకున్న మహిళలకు ముక్కుపుడక ఉచితంగా ఇస్తామంటూ ఆఫర్ ప్రకటించింది. ఒకవేళ పురుషులు వ్యాక్సిన్ వేయించుకుంటే హ్యాండ్ బ్లెండర్ ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించడం ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: