వేసవిలో బండి స్టార్ట్ చేసే ముందు.. ఇది గుర్తుంచుకోండి..?

praveen
వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా చల్లదనం కోసం ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓ వైపు ఆకాశం నుంచి సూర్యుడు భగ భగ మండే సూర్యుడి వేడి నుండి ఇంట్లో ఉన్న ప్రజలందరూ చల్లగా అనుభూతిని పొందడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారూ. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏదో ఒక విధంగా సూర్యుని వేడి మాత్రం తగులుతూనే ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఎక్కువగా రాత్రి సమయంలో నిద్ర పోవాలి అంటే చల్ల గాలి తగిలే ప్రదేశాలలో పడుకుంటూ ఉంటారు చాలామంది. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు అటు వివిధ రకాల జంతువులు కూడా చల్లటి ప్రదేశాలను నిదురించేందుకు వెతుకుతూ ఉంటాయి.

 అయితే ఇలా సాధారణంగా జనావాసాల్లో ఉండే కొన్ని రకాల జంతువులు చల్లగా ఉండే ప్రదేశాలలో నిద్రిస్తూ ఉంటాయ్. ముఖ్యంగా  వాహనాలు కింద ఎక్కువగా చల్లగా ఉంటుంది.. అందుకే అక్కడ నిద్రించడానికి ఎక్కువగా వెళుతూ ఉంటాయి జంతువులు. కొన్ని కొన్ని సార్లు అనుకుని ఘటనల  కారణంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి. ఉదయాన్నే ఇక పని తొందరలో కారు లేదా ట్రాక్టర్ వంటివి ముందూ వెనకా చూసుకోకుండా డ్రైవ్ చేయడం కారణంగా వాటి టైర్ల కింద నిద్రిస్తున్న కొన్ని రకాల జంతువులు మృతి చెందే అవకాశం ఉంది.

 సాధారణంగా అయితే ఇక ఏదైనా వాహనం స్టార్ట్ చేయగానే ఆ శబ్దానికి ఇక ఆ వాహనం కింద పడుకున్న జంతువులు అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. కానీ కొన్ని కొన్ని సార్లు ఇక జంతువులు అలా ఉండిపోవడం కారణంగా ఎన్నో ప్రాణాలు ఇక వాహనాల టైర్ల కింద పడి చితికి పోతున్నాయి.  అందుకే వేసవి కాలంలో ఎవరైనా వాహనం తీయాలి అనుకుంటే ముందుగా ఆ వాహనం యొక్క టైర్ల కింద జంతువులు ఉన్నాయో లేదో అన్న విషయాన్ని ముందుగా గమనిస్తే ఒక ప్రాణాన్ని కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: