భర్త చనిపోయి దుఃఖంలో ఉంటే.. అఫైర్ అంటగట్టారు.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో సభ్య సమాజం తీర దారుణం గా మారిపోతుంది. కొన్ని కొన్ని సార్లు మానవత్వం ఉన్న మనుషులు కాస్త కసాయి లాగా మారిపోయి ఎదుటివాళ్లను వేధిస్తున్న ఘటనలు ఎన్నో తెర మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ భర్త చనిపోయి ఎంతో దుఃఖంలో ఉంది. భర్త లేని జీవితం ఎలా అని ఆలోచిస్తూ కుమిలిపోతుంది.. ఇలా భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళకు అక్రమసంబంధం అంటగట్టారు కొంతమంది దుర్మార్గులు. అంతటితో ఆగకుండా ఇక ఆమెను ఇంటి నుంచి వెళ్లిపోవాలి అంటూ వేధించడం మొదలు పెట్టారు

 దీంతో అప్పటికే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖం లో ఉండి కుమిలిపోతున్న సదరు మహిళ ఇక అలాంటి సమయంలో అక్రమ సంబంధం అంటగట్టడం తో ఇక అవమాన భారాన్ని తట్టుకోలేకపోయింది చివరికి ఈ జీవితం వృధా అని భావించి కఠిన నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది సదరు మహిళ. షాకింగ్ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం లో వెలుగులోకి వచ్చింది ఏలేశ్వరం పట్టణంలోని మందుల కాలనీలో సత్తిబాబు అప్పయ్యమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు అయితే ఇటీవలే సత్తిబాబు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు అయితే ఇక ప్రస్తుతం సదరు మహిళ మందులు కాలనీలోని అత్తవారింట్లో నే ఉంటుంది

 ఈ క్రమంలోనే అప్పయ్యమ్మ కు కొంతమంది స్థానికులు అక్రమసంబంధం అంటగట్టారు. ఇలా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్న నువ్వు మా ఊరిలో ఉండడానికి వీలు లేదని ఊరు విడిచిపెట్టి పోవాలి అంటూ గ్రామస్తులు బెదిరించడం మొదలు పెట్టారు. ఇక రోజు రోజుకు స్థానికుల వేధింపులు మరింత ఎక్కువ కావడంతో సదరు మహిళ ఎంతో కుమిలిపోయింది ఈ క్రమంలోనే తలలో పేలు చంపేందుకు వాడే మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తొమ్మిది మంది వ్యక్తులు తన కోడలని వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంది అని ఆరోపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: