గుంటూరు టీడీపీలో కలకలం.. జగన్‌కు పాలాభిషేకం చేస్తారట..!
అంతటితో కూడా ఆగని వర్మ... ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాపట్ల ప్రాంతానికి రూ.500 కోట్లతో వైద్య కళాశాల మంజూరు చేయటం, జిల్లా కేంద్రంగా బాపట్లను చేసేందుకు సానుకూలంగా స్పందించటం చూస్తుంటే ఈ ప్రాంతానికి చెందిన ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాపట్ల ప్రాంతం అభివృద్ధి జిల్లా ఏర్పాటుతోనే సాధ్యమని, ఇందుకు కోన ప్రభాకరరావు చేసిన కృషిని అందిపుచ్చుకుని ఆయన తనయుడు, ఉప సభాపతి కోన రఘుపతి అవకాశం ఉన్నప్పుడల్లా జిల్లా ప్రస్తావనను తెరమీదకు తీసుకురావటం అభినందనీయమన్నారు.
చరిత్ర కలిగిన బాపట్ల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న రఘుపతికి రాజకీయాలకు అతీతంగా అంతా సహకరించాలని కోరారు. మునిసిపాలిటీని ఏకగ్రీవం చేసుకుని ముఖ్యమంత్రికి, కోన రఘుపతికి బహుమతిగా ఇద్దామని కోరారు. రాజకీయ నాయకులుగా విధానపరమైన విషయాలపై వ్యతిరేకిద్దామని, బాపట్ల అభివృద్ధి విషయంలో ఏకతాటిపై నిలిచి అంతా కోన రఘుపతికి మద్దతుగా నిలవాలని కోరారు.
దీంతో ఇప్పుడు ఈ విషయంపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన నాయకులు.. అయితే ఏదైనా చేయొచ్చు.. కానీ.. సీనియర్లు కూడా ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక ఏంజరిగిందనే కోణంలో పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు అందిందని అంటున్నారు.మరి వర్మపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోచూడాలి.