బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి.. సొంత పార్టీ నేతలే అవాక్..?

praveen
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరికొన్ని రోజులు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వాడి వేడి గా మారిపోయాయి. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని అటు అన్ని పార్టీలు కూడా ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ పార్టీ కి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ పశ్చిమబెంగాల్లో సత్తా చాట లేకపోయినా బిజెపి ఈసారి మాత్రం  భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

 ఈ క్రమంలోనే ఇక అభ్యర్థులను రంగంలోకి దింపడం విషయంలో కూడా బిజెపి ఊహించని ప్రణాళికలను అమలు చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  అదే సమయంలో అటు తమ బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల బీజేపీ పార్టీ ఒక నియోజకవర్గంలో బరిలోకి దింపిన అభ్యర్థి విషయం కాస్త ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.  ఏకంగా బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక పనిమనిషిని పార్టీ రంగంలోకి దింపింది.  ఇదే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయింది.

 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అస్ గ్రామ్ నియోజకవర్గంలో బిజెపి తమ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక పనిమనిషిని రంగంలోకి దింపడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం ప్రత్యర్థులను మాత్రమే కాదు అటు సొంత పార్టీ నేతలను కూడా ఈ అంశం ఆశ్చర్యానికి గురి చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గుష్కర మున్సిపాలిటీ కు చెందిన సదరు మహిళ పనులకు సెలవు పెట్టి ప్రస్తుతం ప్రచారంలో పాల్గొంటున్నారు. పేదరికం వల్ల తాను ఎలాంటి చదువులు చదువుకో లేదని కానీ మోడీ పాలన నచ్చి గత ఐదేళ్ల నుంచి బీజేపీతోనే కొనసాగుతున్నాను అంటూ సదరు మహిళ చెప్పుకొచ్చింది. అయితే ఒక పని మనిషిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దింపడం వెనుక వ్యూహం ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: