శృంగారంపై ఆసక్తి తగ్గుతుందా.. అయితే ఇలా చేయండి..?

praveen
నేటి రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.  టెక్నాలజీ పెరిగిపోతుండటమే కాదు అటు జీవనశైలిలో కూడా ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. అయితే జీవనశైలిలో వస్తున్న కొన్ని మార్పులు మంచి కోసం అయితే కొన్ని రకాల మార్పులు మాత్రం ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేందుకు దారితీస్తున్నాయి.  ఈ క్రమంలోనే అధునాతన జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు..  శారీరక శ్రమ తక్కువ అవుతూ ఉండడం వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు నేటి రోజుల్లో జనాలు.

 ముఖ్యంగా నేటి రోజుల్లో ఎంతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని ప్రతి ఒక్కరు గడుపుతున్న నేపథ్యంలో అటు సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఎంతోమంది శృంగార జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ నిరాశతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితం డబ్బులు సంపాదించాలనే ఆశ ఎంతో ఒత్తిడితో కూడిన జీవనశైలి..  వెరసి ఎవరికి శృంగారం  పైన అంతగా ఆసక్తి కూడా ఉండడం లేదు. ఈ క్రమంలోనే  ఎంతోమందిలో శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.  తద్వారా ఎంతో మంది తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు.

 అయితే ఒకవేళ ఇలా శృంగారం పై ఆసక్తి తగ్గి పోతుంది అని భావిస్తే కొన్ని రకాల వంటింటి చిట్కాలు పాటించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని శృంగార సామర్థ్యం పెరిగి పోవడమే కాదు ఆసక్తి కూడా పెరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం ఉల్లిపాయ రసం తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందట. ఏకంగా మూడురెట్లు పాటు శృంగారంపై ఆసక్తి పెరుగుతుంది అని నిపుణులు  చెబుతున్నారు. ఒకవేళ ఉల్లి జ్యూస్ తాగలేము అనుకున్న వారు ఉల్లిపాయ ముక్కలను కాస్త వెన్న లో ఫ్రై చేసి అందులో తేనె కలిపి రోజు ఉదయం తినడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: