కేటీఆర్, గంటా భేటీ.. అసలు మర్మం ఏంటీ..?

praveen
సాధారణంగా రాజకీయాల్లో ఎవరు ఊహించని భేటీలు జరిగాయి అంటే చాలు ఇక రాజకీయాల్లో అదే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది.  ఇటీవల ఇలాంటి ఒక బేటీ ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్  తెలుగుదేశం సీనియర్ నేత ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ కావడం ఆసక్తికరంగా మారిపోయింది. శాసనసభ సమావేశాలలో భాగంగా ఎంతో బిజీగా ఉన్న కేటీఆర్ ను అసెంబ్లీలో టీ బ్రేక్ సమయంలో గంటా శ్రీనివాసరావు కలిశారు. అయితే గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రాలో స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు  కు వ్యతిరేకంగా ఉదృతంగా ఉద్యమానికి మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది.

 అయితే మొన్నటికి మొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలకడం ఏకంగా విశాఖపట్నం వెళ్లి అక్కడ ఉద్యమంలో పాల్గొంటా అంటూ చెప్పడం.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఏపీ టీడీపీ లో కీలక నేత అయిన గంటా శ్రీనివాసరావు మంత్రి కేటీఆర్ ని కలవడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. స్టీల్ ప్లాంట్ కు మద్దతు ఇచ్చినందుకు గాను మంత్రి కేటీఆర్ కు ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపేందుకు భేటీ అయినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

 అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇక తెలంగాణ మంత్రులతో కలిసి విశాఖపట్నం వస్తామని ఎన్టీఆర్ హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు సంబంధించిన ప్రకటన చేయగానే అటు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అనే విషయం తెలిసిందే. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు తాను పోరాటం చేస్తాను అంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలోనే ఇక స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పోరాటంలో భాగంగా మరింత మద్దతు కూడగట్టుకునేందుకు గంటా ఇలాంటి బేటీ అవుతున్నట్లు ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: