ఫోన్‌ రికార్డింగ్‌.. బ్లాక్‌ మెయిల్.. మహిళ ఆత్మహత్యాయత్నం.. !?

N.ANJI
దేశంలో చాల మంది కష్టపడటానికి ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. ఇక చాల మంది మోసాలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది స్నేహం ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇరాక్ పరిచయం ఉన్న వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండగా ఫోన్ రికార్డింగ్ చేసి మహిళను బ్లాక్‌ మెయిల్ చేసిన ఘటన కావలి జలదంకి మండలం కొత్తపాళెంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలదంకి మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన మహిళకు ప్రసాద్‌రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఆ మహిళ తనతో పాటు చదువుకున్న ఓ వ్యక్తి హోటల్ లో పనిచేస్తుండగా అతడితో అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడేది. అయితే ఆ మహిళకు ఫోన్ లేకపోవడంతో దగ్గరి బంధువైన వెంకటరెడ్డి ఫోన్‌లో మాట్లాడేది. అయితే ఆమెకు తెలియకుండా వెంకట్‌ రెడ్డి ఆ ఫోన్‌ సంభాషణ రికార్డ్ చేసేవాడు.

ఇక కొన్ని రోజులకు వీటిని మీ భర్త, అత్త మామలకు ఇస్తానని చెప్పి డబ్బుల కోసం వేధించసాగాడు. కొన్ని రోజుల డబ్బులిచ్చిన ఆ మహిళ తన వద్ద ఇక డబ్బులు లేవని తెగేసి చెప్పింది. దీంతో రికార్డ్‌లను వారి భర్తకు వినిపించాడు వెంకట్‌ రెడ్డి. ఇక అప్పటి నుంచి భర్త, అత్త మమాలు ఆమెను అనుమానించి వేధించసాగారు. దీంతో ఆమె సూసైడ్ చేసుకుంది.

అయితే మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు. కావలి రూరల్‌ సీఐ పి.అక్కేశ్వరరావు, జలదంకి ఎస్సై ఎం.వెంకట్రావు, సిబ్బంది దర్యా ప్తు చేసి కోట వెంకటరెడ్డి ఫోన్‌లోని డేటాను శాస్త్రీయంగా సేకరించి కేసును దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆత్మహత కేసుగా నమోదు కాగా, దర్యాప్తు అనంతరం మృతురాలి భర్త ప్రసాద్‌రెడ్డి, మిగిలిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో భర్తతో పాటు సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డు చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసిన కోట వెంకటరెడ్డిను శనివారం అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: