విధి ఆడిన వింత నాటకం.. అక్క బ్రతికింది.. తమ్ముడి ప్రాణం పోయింది..?

praveen
విధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం ఆట బొమ్మలు మాత్రమే. అందుకే మనుషులు ఏదో చేయాలి  అనుకున్నప్పటికీ వీధి చేయాల్సింది చేస్తూ పోతూనే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో విధి చిన్న చూపు చూసి చివరికి... ప్రాణాలు సైతం పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇలా విధి ఆడిన వింత నాటకంలో మనుషులు ఎప్పుడు ప్రాణాలు కోల్పోతారు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది.  అనుకోని సంఘటనల తో మృత్యువు దరి చేరి చివరికి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 పాఠశాల నుంచి అక్కను ఇంటికి తీసుకు వెళుతూ ఉండగా విధి వారి ఆనందాన్ని చూసి ఓర్వ లేక పోయింది. ఈ క్రమంలోనే అక్క కళ్ళముందే తమ్ముడు ప్రాణాలను తీసేసింది. అక్క ప్రాణాలను కాపాడ పోయిన బాలుడు చివరికి తన ప్రాణాలను వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. విధి ఆడిన వింత నాటకంలో అక్క ప్రాణాలతో బయట పడితే తమ్ముడు అక్కను  కాపాడబోయి ప్రాణాలు వదిలాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది మచ్చ బొల్లారం కి చెందిన శేఖర్ రేణుకకు ముగ్గురు సంతానం రామ్చరణ్ విష్ణువర్ధన్ కవలలు కాగా వీరూ బొల్లారంలోని త్రిశూల్ పార్క్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్నారు

 వీరి అక్క మేఘన మచ్చ బొల్లారం లోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతుంది అయితే ఇటీవలే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అక్క పాఠశాలకు వెళ్లి తీసుకువచ్చేందుకు వెళ్లాడు తమ్ముడు రామ్ చరణ్. ఇక సాయంత్రం నాలుగు గంటల సమయంలో అతను తీసుకువస్తుండగా ప్రధాన రహదారి పైకి రాగానే వెనుక నుంచి అధిక లోడుతో ఓ ట్రక్కు వస్తుండటాన్ని రామ్ చరణ్ గ్రహించాడు ఇక వెంటనే అక్కను పక్కకు తోసేసాడు.అంతలో తాను తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే ట్రక్కు ఢీ కొట్టింది దీంతో అక్కమ్మ కళ్ళముందే తమ్ముడు మృత్యువాత పడడంతో ఇక జీర్ణించుకోలేక పోయింది.  ఈ క్రమంలోనే తమ్ముడి కోసం అక్క విలపించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: