వైయస్ షర్మిల ను కలిసిన స్టార్ క్రికెటర్ కొడుకు.. దేనికోసమో..?

praveen
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ఇక తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయ నేతల ఎదగాలని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి   రాజకీయ వారసురాలు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రస్తుతం మంతనాలు  మొదలుపెట్టింది అనే విషయం తెలిసిందే. తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యం అంటూ వైఎస్ షర్మిల చెప్పింది.  అయితే ప్రస్తుతం షర్మిల పార్టీ పెడతానని ప్రకటించగానే ఎంతో మంది అధికార పార్టీలో నుంచి మాత్రమే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా షర్మిల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 షర్మిల పార్టీ ను ఎప్పుడు స్థాపించారు పోతున్నారు అన్నదానిపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ పార్టీ స్థాపిస్తారు అని మాత్రం ఇక ఆమె చెప్పడంతో.. ఎంతోమంది షర్మిల పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. కేవలం ఇతర పార్టీల నేతలు మాత్రమే కాదు ఇప్పటి వరకు అసలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వారు కూడా షర్మిలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజురోజుకు షర్మిల  బలాన్ని కూడగట్టుకుని ఇక ఆ తర్వాత పార్టీని స్థాపించి క్రియాశీలకంగా వ్యవహరించ పోతున్నట్లు సమాచారం.

 ఇకపోతే ఇటీవలే వైయస్ షర్మిల ను మాజీ భారత క్రికెటర్ అజారుద్దీన్ తనయుడు కలిసి పలు విషయాలపై చర్చలు జరపడం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఆసక్తికరంగా మారిపోయింది. కేవలం అజారుద్దీన్ తనయుడు మాత్రమే కాదు భారత టెన్నిస్ ప్లేయర్.. సానియా మీర్జా సోదరి కూడా షర్మిల తో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి పలు విషయాలపై చాలా సమయం పాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ వైయస్ షర్మిల తో ఎందుకు సమావేశం అయ్యారు అన్నది మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: