యనమలకు భలే కౌంటర్ ఇచ్చాడే పవన్...!!

Edari Rama Krishna
రాజధాని భూములపై పవన్  సీరియస్ గానే స్పందిస్తున్నట్లు కనిపిస్తుంది.. బలవంతపు భూసేకరణ వ్యతిరేకిస్తూ పవర్ స్టార్ గత వారం రోజుల్లో నాలుగవసారి ట్వీట్లు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ట్వీట్‌పై నిన్న ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధానిలో కొన్ని గ్రామాల్లో భూసేకరణ చేపట్టవద్దంటూ ట్వీట్లు చేయడం కంటే భూసేకరణ ఎలా చేయాలో కూడా పవన్ చెబితే బాగుంటుందన్నారు.హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు ఇచ్చినందునే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. మద్యలో ఉన్న భూములను సేకరించకుండా విడిచిపెట్టడం సాధ్యంకాదని యనమల తేల్చిచెప్పారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం ఇప్పటికే ఆలస్యం అయ్యిందని ఈ విషయాన్ని సాగదిస్తూ పోతే రాజధాని నిర్మాణం పూర్తిగా కుంటు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. పదేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిగా జరగక పోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి జనసేన అధ్యక్షులు ఊహించుకోవాలని అయన సూచించారు.ఏపీ రాజధానికి భూసేకరణ విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.దానికి ఇవాళ పవన్ ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యల్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తే... విజ్ఞతతో స్పందించడం మాని రైతుల ఆవేదనను వెటకారం చేయడం వారికే చెల్లిందని ట్విట్టర్లో ఎండగట్టారు.

రైతులతో మాట్లాడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్


హైదరాబాద్‌లో సినీ పరిశ్రమకు కొండలు ఇచ్చారు తప్ప... బహుళ పంటలు పండే భూములు కాదన్నారు.. పవన్‌ కల్యాణ్‌. ఈ విషయం మంత్రి యనమలకు బహుశా తెలీదనుకుంటా అంటూ  కౌంటర్‌ ఇచ్చారు.. పవన్‌. కట్టేది స్వర్గమని ముందే తెలిస్తే.. అది త్రిశంకు స్వర్గమా? సామాన్య స్వర్గమా? అనేది తర్వాత ఆలోచించవచ్చన్నారు.. పవన్‌. త్వరలో తాను ఉండవల్లి, బేతపూడి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి... రైతులతో మాట్లడతానని ట్విట్టర్లో పేర్కొన్నారు.

పవన్ కళ్యాన్ ట్విట్స్ : 

ముందు కట్టేది స్వర్గం అని తెలిస్తే అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చు ..

— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2015 సినిమా పరిశ్రమకి హైదరాబాద్ లో ఇచ్చినివి కొండలు..బహుళ పంటలు పండే పొలాలు కాదు ,ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంట.

— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2015 పైగా..హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ నాకైతే స్టూడియోలు లేవు.

— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2015 నేను ఎంతోబాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందిచడం మానేసి రైతుల ఆవేదనని వెటకారం చెయ్యడం వారికే చెల్లింది

— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2015 నేను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి ,పెనుమాక తదితర నది పరివాహక గ్రామాల రైతులిని కలుస్తాను.

— Pawan Kalyan (@PawanKalyan) August 20, 2015

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: