దుబాయ్ నుండి వచ్చిన భర్త.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య.. అసలేం జరిగిందంటే..?

praveen
ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. మనసా వాచా కర్మణ వేదమంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వారే ఏకంగా కట్టుకున్న వారిని నిలువునా ముంచేస్తూ చివరికి పరాయి వ్యక్తులతో రాసలీలలు కొనసాగిస్తున్న ఘటనలు ఎన్నో  సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. అయితే వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో దారుణ ఘటనలూ  వెలుగులోకి వస్తున్నప్పటికీ అటు జనాల  తీరులో మాత్రం మార్పు రావడం లేదు. క్షణకాల  సుఖం కోసం ఏకంగా కట్టుకున్న వారిని మోసం చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంతటితో ఆగకుండా అంతమొందించడానికి కూడా వెనకాడటం లేదు.

 ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు ఒక వ్యక్తి. అక్కడ ఎంతో కష్టపడుతూ ఇంటికి డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. కానీ అతని భార్య ఊహించని ఆలోచన చేసింది. భర్త దుబాయ్ లో ఉండడంతో ఒంటరితనాన్ని తట్టుకోలేక పోయిన భార్య చివరికి వివాహేతర సంబంధానికి తెరలేపింది. అంతే కాదు ఎంతో ఆనందంగా కుటుంబంతో గడపడానికి దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన భర్తకి ఊహించని షాక్ ఇచ్చింది. తన ప్రియుడిని పెళ్లి చేసుకుంటానని అతనితోనే ఉంటాను అంటూ పట్టుబట్టింది.  అయితే కూతురు తీరుతో పరువు పోయింది అని భావించిన తండ్రి ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

 ప్రొద్దుటూరుకు చెందిన రాజశేఖర్ కూతురు వనజా రాణి కి .. గురువేంద్ర  తో వివాహం జరిగింది వీరికి కుమార్తె పూజ కూడా ఉంది.  రాజశేఖర్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లగా భార్య  పొద్దుటూరులో తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే పెళ్లికి ముందు తనతో చనువుగా ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధానికి తెరలేపింది వనజ రాణి.  ఈ విషయం దళిత గిరిజనుల వరకు వెళ్లగా తీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరించారు.  కానీ వనజ రాణి తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవలే భర్త దుబాయ్ నుంచి ఇంటికి రాగా.. విడాకులు ఇవ్వాలని తాను మరొకర్ని పెళ్లి చేసుకుంటాను అంటూ భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఆమెకు ఎంత నచ్చచెప్పాలని ప్రయత్నించిన వినలేదు. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన తండ్రి ఏకంగా కూతురు ని దారుణంగా అంతమొందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: