రోజూ పరగడుపునే బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!?

N.ANJI
బీట్ ‌రూట్‌ ఈ పేరు చెప్పిన చాల మంది ఆమడ దూరంలో ఉంటారు. చాలా మందికి బీట్‌ రూట్‌ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే దాన్ని తినడానికి, దాని జ్యూస్‌ తాగేందుకు అయిష్టతను కనబరుస్తుంటారు. అయితే అందరికి తెలియని విషయం ఏంటంటే బిట్ రూట్ వలన ఆరోగ్యానికి చాల మంచిది. కానీ నిజానికి బీట్ ‌రూట్‌లో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కనుక బీట్‌రూట్‌ను ప్రతి ఒక్కరు కచ్చితంగా తినాల్సిందే. అయితే బీట్‌రూట్‌ను తినడం ఇష్టం లేని వారు, కనీసం దాని జ్యూస్‌ను అయినా రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాలి. దాంతో మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే రక్తహీనతతో బాధపడే వారు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే ఫలితం ఉంటుంది. చాలా త్వరగా రక్తం తయారవుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయాన్నే బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శక్తి అందుతుంది. దాంతో చురుగ్గా ఉంటారు. ఏ పనైనా చేయగలుగుతారు.
హైబీపీ ఉన్నవారికి బీట్‌ రూట్‌ ఔషధమనే చెప్పవచ్చు. బీట్ ‌రూట్‌లో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్‌ అధికంగా ఉన్నవారు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే ఫలితం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ కరిగిపోతుంది. ఫలితంగా బరువు కూడా తగ్గుతారు.
గర్భిణీలు బీట్ ‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల వారి కడుపులో ఉండే బిడ్డకు ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. దీంతో బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. లివర్‌ సమస్యలు ఉన్నవారు రోజూ బీట్ ‌రూట్‌ జ్యూస్‌ తాగడం మంచిది. దీంతో లివర్‌ శుభ్రం అవుతుంది. లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. నిత్యం బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: