కేజ్రీవాల్ ప్రభుత్వానికి కొత్త సమస్య... తిరగబడుతున్న ప్రజలు..?

praveen
కొన్ని కొన్ని సార్లు ప్రభుత్వాలు వ్యవహరించే తీరు ప్రజలను అసహనానికి గురి చేస్తూ ఉంటుంది  అన్న విషయం తెలిసిందే  ఒకరిని ఒకలా  చూడటం మరొకరి పట్ల వివక్ష చూపడం లాంటివి కొన్నిసార్లు ప్రభుత్వాలు అనుకోకుండా చేయడం వల్ల అటు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి  తిరుగుబాటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వం ఇలాంటి తరహా సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి రైతులు వేల సంఖ్యలో తరలి వచ్చి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమాలు చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే.

 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ ఇక ఢిల్లీ సరిహద్దులను నిర్బంధించి ఉద్యమాల బాటపట్టారు రైతు సంఘాలు. అయితే వేల సంఖ్యలో రైతులు ఒకేచోట కూర్చుని ఉద్యమాలు చేస్తున్నా  ప్రతి ఒక్కరు కూడా మాస్కు ధరించకపోవడం భౌతిక దూరం అనేనిబంధనలు పాటించడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే కేరళ మహారాష్ట్ర తర్వాత అత్యధిక కరోనా వైరస్ కేసులు ఉన్న రాష్ట్రంగా ఉన్న ఢిల్లీలో రైతులు మాస్కు ధరించక పోయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం హాట్ టాపిక్  గా మారిపోయింది.

 అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ఎవరైనా బైక్పై వెళ్తున్న సమయంలో బైక్ పక్కన ఆపి మాస్క్ తీసి ఫోన్ మాట్లాడిన కూడా రెండు వేల రూపాయల జరిమానా విధిస్తుంది ప్రభుత్వం. ఇలా కోట్ల ప్రభుత్వం జరిమానాల రూపంలో కోట్ల  రూపాయలు సంపాదిస్తుంటే  ప్రజల పట్ల వివక్ష పూరితంగా  వ్యవహరిస్తున్న ప్రభుత్వం అటు  ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేపడుతున్న రైతుల విషయంలో మాత్రం ఎందుకు ఎలాంటి నిబంధనలు విధించడం లేదు అనే ఆలోచన ప్రజలలో వచ్చి  ఇక ప్రభుత్వ తీరుపై ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: