ఆదుకుంటానని నమ్మించి మోసం చేసిన సోనూసూద్.. ఎంత దగా..?
రొటీన్ మోసాలు బోర్ కొట్టాయేమో ఓ సైబర్ నేరగాడు ఏకంగా ప్రముఖ నటుడు సోనూసూద్ నే వాడేస్తున్నాడు. సోనూసూద్.. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా గుర్తొస్తున్న పేరు ఇది. కష్టంలో ఉన్నా అంటూ మెస్సేజ్ పెడితే చాలు.. ఇంటి మనిషిలా ఆ కష్టం తీరుస్తున్నాడు. లాక్ డౌన్‌లో వలస జీవులను ఆదుకోవడంతో మొదలైన ఆయన సహాయక చర్యలు.. ఇప్పుడు అనేక మందికి విస్తరించాయి. అందుకే సాయం చేయాలనుకునే వారు కూడా ముందు నెట్‌లో సోనూసూద్ పేరే వెదుకుతున్నారు.
అదిగో అలాంటి వాళ్లను మోసం చేసేందుకు ఓ సైబర్ నేరగాడు తయారయ్యాడు. సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో ఓ నకిటీ అడ్రస్ క్రియేట్ చేశాడు. గూగుల్‌లో కొడితే తన నంబర్ వచ్చేలా చేశాడు. పాపం ఓ దాత.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. గూగుల్‌లో సోనూసూద్ ఫౌండేషన్ వివరాలు వెతికాడు. అందులో కనిపించిన ఈ సైబర్ నేరగాడి నంబర్‌కు ఫోన్ చేశాడు. దీంతో పంకజ్‌సింగ్ అనే ఆ సైబర్ నేరగాడు ఆ దాత బ్యాంక్ ఖాతా, ఆధార్ వివరాలు తీసుకున్నాడు.
సాయం చేసేందుకు కూడా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందంటూ ఓ పది వేలు గుంజాడు. ఆ తర్వాత.. అవతల సాయం పొందే వ్యక్తికి మూడున్నర లక్షలు కావాలంటూ ఆ మొత్తం సాయం చేయాలని ఒత్తిడి చేశాడు. మొత్తానికి విడుదల వారీగా దాత నుంచి రూ.60వేలు వరకూ సదరు సైబర్ మోసగాడు పంకజ్ సింగ్ వసూలు చేశాడు. ఆ తర్వాత దాతకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఆ తర్వాత పోలీసులు చెక్ చేస్తే అందంతా ఫేక్ అని తేలింది.