సాఫ్ట్వేర్ ఎఫెక్ట్.. పడిపోయిన రియల్ ఎస్టేట్.. రంగంలోకి దిగిన మంత్రి..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ కారణంగా సాఫ్ట్వేర్ సంస్థలు అన్ని  కూడా వర్క్ ఫ్రం హోమ్  గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే.  ఇక దాదాపు ఒక సంవత్సరం నుంచి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ప్రస్తుతం  వైరస్ ప్రభావం తగ్గి.. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభించేందుకు  అనుమతులు వచ్చినప్పటికీ సాఫ్ట్వేర్ సంస్థలు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. దీనికి కారణం అటు ఉద్యోగులు కార్యాలయానికి వస్తే కార్యాలయ నిర్వహణ ఖర్చు తో పాటు వివిధ ఖర్చులు కూడా ఉంటాయని అదే ఇంటి నుంచి పని చేస్తే అలాంటి ఖర్చు ఏవి ఉండకపోగా ఉద్యోగులతో  ఎక్కువసేపు వర్క్ చేయించుకునే అవకాశం కూడా ఉంది అని భావిస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు  ప్రస్తుతం... వర్క్ ఫ్రం హోమ్  వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి అనే విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగులు అందరు కూడా మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఎంతో సంబరపడి పోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఒత్తిడి పెరిగి పోవడంతో  సెలవు దినాల్లో కూడా పని చేయాల్సి వస్తూ  ఉండడంతో ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన చెందడం ఏమో కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై ఆధారపడి ఉన్న ఎంతోమంది ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలపై ఆధారపడేవారి  సంఖ్య  ఎక్కువగా ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీల మీద కర్రీ పాయింట్ లు  ఫుడ్ ట్రక్కులు పబ్బులు క్లబ్బులు ఇలా అన్ని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగుల పైన ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.

 ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వారి సంపాదన కంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం లక్సరీ లైఫ్ కి అలవాటు పడడంతో ఇక వీరిపై 24 రంగాలు ఆధారపడి ఉంటాయి. కానీ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం నడుస్తున్న నేపథ్యంలో  సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంటిపట్టునే ఉండి పోతున్నారు  శని ఆదివారాల్లో కూడా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఎంతో మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు జీతాలు తగ్గి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ  నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది ఒకప్పుడు లక్షలకు లక్షలు జీతాలు తీసుకొని ఎక్కువగా రియల్ ఎస్టేట్ పై ఇన్వెస్ట్  చేసే సాఫ్ట్వేర్ లు  ఇక ఇప్పుడు జీతాలు తగ్గిపోవడం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుండటంతో రియల్ ఎస్టేట్ పై అంతగా ఆసక్తి చూపడం లేదు.దీంతో రియల్ దందా కాస్త.. అయోమయంలో పడిపోయింది. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కేటిఆర్...  ప్రభుత్వం సాఫ్ట్వేర్ కంపెనీలకు  ఇచ్చే రాయితీలు అన్ని  కూడా సాఫ్ట్వేర్  పై ఆధారపడి ఉన్న అన్ని రంగాలు బాగుపడడానికి అని చెబుతూ తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీలు ప్రారంభించే  దిశగా ప్రస్తుతం.. సంప్రదింపులు జరిపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: