పుర పోరు: జమ్మలమడుగు లో ఉద్రిక్త వాతావరణం.. ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యిందా?
విషయానికొస్తే.. జమ్మలమడుగు ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థి విషయంలో జమ్మలమడుగులో సోమవారం ఉద్రిక్తత వాతావరణం తలెత్తింది. పోలీసుల కథనం ప్రకారం: నగర పంచాయతీ పరిధిలోని 18వ వార్డుకు వైకాపా కార్యకర్త మున్నా గతంలో స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. అదే వార్డులో మరి కొంతమంది వైకాపా తరపున పోటీ చేస్తున్నందున మున్నాను పోటీ నుంచి విరమించుకోవాలని నాయకులు కోరారు. ఇకపోతే బీజేపికి చెందిన కొందరు నాయకులు బరిలో ఉంటే మద్దతుగా ఉంటామని చెప్పడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇది ఇలా ఉండగా మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.. మున్నా కనిపించడం లేదని అతని తల్లి గౌసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా దేవగుడిలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో బాధితుడిని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టినట్లు సీఐ వెంకటేశ్వర్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు భారీగా పోలీసు స్టేషన్‌కు చేరుకోవడంతో ఘర్షణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రత్యేక బలగాలు మోహరించారు. తర్వాత డీఎస్పీ నాగరాజు పోలీసు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అతను ఇరు వర్గాల నేతలతో చర్చలు జరపడం తో గొడవ సర్దు మనిగింది. ఈరోజు మున్నా బరిలో ఉంటాడా? లేక నామినేషన్ ఉపసంహరణ చేసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది..