బ్రాహ్మణ ఘోష: కేసీఆర్ వేసిన అడుగు జగన్ ఎందుకు వేయలేదు ?
అయితే.. ఇది మాత్రమే కాదని.. ఇంకా వారికి ప్రాధాన్యం పెరగాలని.. సర్వత్రా వినిపిస్తున్న మాట. వాస్తవానికి ఎమ్మెల్సీ వంటి పదవుల విషయంలో అభ్యర్థులను ప్రకటించినప్పుడు.. కొంత వ్యతిరేకత.. అలకలు కామన్. అయితే.. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై కేవలం ఆ పార్టీలోనే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సానుకూలత వ్యక్తమైంది. ఇప్పటికైనా కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయితే.. అదేసమయంలో ఇది చాలదు.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక, ఏపీ విషయానికి వస్తే.. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు.
వీరిలో ఏ ఒక్కరికీ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వలేదు. ఇది విమర్శల కు తావిస్తోంది. అంతేకాదు.. కేవలం ఎన్నికల సమయంలోనే బ్రాహ్మణులకు హామీలు గుప్పిస్తున్నారనే వాదన ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బ్రాహ్మణ సామాజిక వర్గానిక చెందిన వారు వైసీపీలోనే ఉన్నారు. కానీ, వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా .. వారిలో ఒకరికి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. బ్రాహ్మణ సామాజిక వర్గానికి కొంత మెరుగైన ఫలితాలుకనిపిస్తున్నా.. ఇప్పట్లో అంత సీన్ ఉందా? అనేది సందేహంగా మారడం గమనార్హం.
బ్రాహ్మణులారా.. జాగృతం కండి
తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులారా.. జాగృతం కండి. మీ హక్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారే తప్ప... మీ సమస్యలు పరిష్కరించేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తించండి. ప్రభుత్వాలు మారినా.. మీ సమస్యలు మాత్రం తీరడం లేదు. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు ఏ ఒక్కరూ బాధ్యతలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మీ గళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ముందుకు వచ్చింది. బ్రాహ్మణుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు https://www.indiaherald.com/ ప్రయత్నిస్తోంది. దీనిలో మీ భాగస్వామ్యమే కీలకం. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.
మీరు చేయాల్సిందల్లా.. ఈ ఫోన్ నెంబరు 8919011959
కు ఫోన్ చేయడమే. లేదా care@indiaherald.com ఈ మెయిల్‌కు మీ సమస్యను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడమే..!